సత్యదేవ్, ఫరియా ‘ట్రయల్ అండ్ ఎర్రర్’ ప్రారంభం

ABN , Publish Date - Oct 11 , 2026 | 08:19 PM

సత్యదేవ్, ఫరియా అబ్దుల్లా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తూ.. శరత్ మరార్ నిర్మిస్తోన్న సిరీస్‌ ‘ట్రయల్ అండ్ ఎర్రర్’. తాజాగా ఈ సిరీస్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

Trial And Error Series Launch

నిర్మాత శరత్ మరార్ నిర్మాణ సంస్థ నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ (Northstar Entertainment) మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సత్యదేవ్, ఫరియా అబ్దుల్లా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తూ.. శరత్ మరార్ నిర్మిస్తోన్న సిరీస్‌ ‘ట్రయల్ అండ్ ఎర్రర్’ (Trial And Error). కమల్ హాసన్ నటించిన స్టైలిష్ థ్రిల్లర్ ‘చీకటి రాజ్యం’కు దర్శకత్వం వహించిన రాజేష్ సెల్వ ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్ తాజాగా సంప్రదాయబద్ధంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


విభిన్నమైన పాత్రల్లో తనదైన నటనతో ఆకట్టుకునే సత్యదేవ్ (Satya Dev).. ఈ సిరీస్‌‌లో మరోసారి ఓ ఛాలెంజింగ్ పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆమె కథకు మరింత ఇంటెన్స్సిటీ తీసుకురానున్నారు. ఫరియా అబ్దుల్లా కూడా ఈ ప్రాజెక్ట్‌లో మరో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ఈ సిరీస్‌లో విరాజ్ అశ్విన్, చైతన్య కృష్ణ, వర్ష బొల్లమ్మ, యష్ పూరి, సంపత్ రాజ్, సుబ్బరాజు కీలక పాత్రల్లో నటించనున్నారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో, రాజేష్ సెల్వ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ‘ట్రయల్ అండ్ ఎర్రర్’.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని నిర్మాత శరత్ మరార్ ఈ సందర్భంగా తెలియజేశారు. మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు.

ఇవి కూడా చదవండి:

ఉత్తమ నటుడిగా జేడీ చక్రవర్తి.. అంతర్జాతీయ పురస్కారం

ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుంచి అదిరిపోయే అప్‌డేట్!

గతంతో పోలిస్తే అన్ని రంగాల్లో పురోగతి.. ఏపీ అభివృద్ధిపై చిరు కీలక వ్యాఖ్యలు

Updated Date - Oct 11 , 2026 | 08:19 PM