ఉత్తమ నటుడిగా జేడీ చక్రవర్తి.. అంతర్జాతీయ పురస్కారం
ABN , Publish Date - Oct 11 , 2026 | 07:04 PM
విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి టైమ్ మళ్లీ స్టార్ట్ అయ్యిందా అంటే.. అవునని చెప్పకతప్పదు. తాజాగా ఆయనను అంతర్జాతీయ అవార్డు వరించింది.
విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి (JD Chakravarthy) టైమ్ మళ్లీ స్టార్ట్ అయ్యిందా అంటే.. అవునని చెప్పకతప్పదు. రవితేజ, వివేక్ ఆత్రేయ కాంబోలో రాబోతోన్న ‘తులాభారం’ చిత్రంలో ఆయన ఓ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆదివారం (అక్టోబర్ 11) గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ సినిమాలో జేడీ విలన్‌గా చేస్తున్నారనే వార్తలు వినిపిస్తుండగానే.. ఇప్పుడాయనకు అంతర్జాతీయ పురస్కారం వరించినట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించిన ‘దహిణి ది విచ్’ (Dahini: The Witch) చిత్రానికి మరో అంతర్జాతీయ పురస్కారం లభించింది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు ధీటుగా నిర్వహించే నార్వే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (Norway International Film Festival)లో ‘దహిణి ది విచ్’ చిత్రానికి గానూ జేడీ చక్రవర్తికి ఉత్తమ నటుడు పురస్కారం లభించింది. ప్రపంచవ్యాప్తంగా 150 నామినేషన్స్ వస్తే.. అందులో బెస్ట్ లీడ్ యాక్టర్ కేటగిరీలో జేడీ చక్రవర్తిని ఈ అవార్డ్ వరించడం నిజంగా గొప్ప విషయమనే చెప్పుకోవాలి. ఇప్పటికే ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్‌లో ఈ చిత్రం అనేక అవార్డ్స్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా నార్వే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ‘దహిణి ది విచ్’ ఉత్తమ చిత్రం అవార్డ్‌ను సైతం దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖ నటులు ఈ నామినేషన్‌లో ఉండగా.. భారతీయ నటుడు జేడీ చక్రవర్తికి ఈ అవార్డ్ దక్కడం గర్వించదగ్గ విషయం.
ఈ సందర్భంగా జేడి చక్రవర్తి మాట్లాడుతూ.. ‘‘వరల్డ్ వైడ్‌గా ఎంతో ప్రసిద్ధి పొందిన, గుర్తింపు ఉన్న హేమాహేమీలు రూపొందించిన చిత్రాలతో పోటీపడి ‘దహిణి’ ఉత్తమ చిత్రం అవార్డ్ దక్కించుకోవడం భారతీయ చలనచిత్ర పరిశ్రమకే గర్వ కారణం. అలానే దాదాపు 150 నామినేషన్లలో వరల్డ్ వైడ్ నటులు ఉండగా, బెస్ట్ లీడ్ యాక్టర్ అవార్డ్ నన్ను వరించడం నన్నెంతో ఆనందానికి గురి చేసింది. ఇలాంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. నన్ను నమ్మి నాకు ఈ పాత్రను ఇచ్చిన దర్శకుడు రాజేష్ టచ్ రివర్‌కి, అలానే నార్వే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నిర్వాహకులకు నా కృతజ్ఞతలు’’ అని అన్నారు.
‘దహిణి ది విచ్’ సినిమా విషయానికి వస్తే.. ఇంతకుముందు ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో పలు గౌరవాలను దక్కించుకుంది. ఆస్ట్రేలియా టైటాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, పసిఫిక్ బీచ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్, స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రం దాదాపు 18 అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుని రికార్డును క్రియేట్ చేసింది. రాజేష్ టచ్ రివర్ దర్శకత్వం వహించిన 'దహిణి ది విచ్' సినిమాలో జేడీ చక్రవర్తితోపాటు.. తనిష్ట ఛటర్జీ, శ్రుతి జయన్ కీలకపాత్రలు పోషించారు. సునీతా కృష్ణన్, ప్రదీప్ నారాయణన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
ఇవి కూడా చదవండి:
ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుంచి అదిరిపోయే అప్‌డేట్!
గతంతో పోలిస్తే అన్ని రంగాల్లో పురోగతి.. ఏపీ అభివృద్ధిపై చిరు కీలక వ్యాఖ్యలు
ఏపీ ఫిలిం ఛాంబర్‌లో M4M హవా.. జో శర్మ, మోహన్ వడ్లపట్లకు అవార్డులు