శ్రీకాంత్ కూతురు.. మూవీ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది! జంట‌ అదిరింది

ABN , Publish Date - Oct 12 , 2026 | 11:56 AM

శ్రీకాంత్ కూతురు మేధ (Medha Meka) కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తూ అంద‌రినీ స‌డ‌న్‌ స‌ర్‌ఫ్రైజ్ చేసింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా అంత‌టా ఈ వార్తే చ‌క్క‌ర్లు కొడుతుంది.

medha mythri

సీనియ‌ర్ న‌టుడు శ్రీకాంత్ (Srikanth)కు ప్ర‌స్తుతం సినిమాల సంఖ్య త‌గ్గినా అడ‌పాద‌డ‌పా హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తూ అల‌రిస్తూనే వ‌స్తున్నాడు. ఈ క్ర‌మంలో ఆయ‌న వార‌సుడు రోష‌న్ (Roshan Meka) గ‌తేడాది ఛాంపియ‌న్ (Champion) సినిమాతో మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకోగా దీపావ‌ళికి ఎమో ఎమో ఇది (Emo Emo Idi ) చిత్రంతో ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఇదిలాఉంటే ఇప్పుడు శ్రీకాంత్ కూతురు మేధ (Medha Meka) కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తూ అంద‌రినీ స‌డ‌న్‌ స‌ర్‌ఫ్రైజ్ చేసింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా అంత‌టా ఈ వార్తే చ‌క్క‌ర్లు కొడుతుంది.

అయితే.. ప్ర‌తిష్టాత్మ‌క టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ (Mythri Movie Makers) ఈ చిత్రాన్ని నిర్మిస్తోండ‌గా గ‌తంలో రాజ‌మండ్రి రోజ్ మిల్క్‌ సినిమాలో న‌టించిన జై జాస్తి (Jai Jasti) హీరోగా న‌టిస్తున్నాడు. 30 వెడ్స్ 21 (30 Weds 21) వెబ్ సిరీస్ ఫేం పృథ్వీ వనం (Prithvi Vanam) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ ఈ చిత్రానికి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి (Miss Shetty Mr Polishetty, ఆంధ్ర కింగ్ తాలుఖా (Andhra King Taluka)వంటి చిత్రాల డైరెక్ట‌ర్ మ‌హేశ్ బాబు (Mahesh Babu P) క్రియేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం విశేషం.

HUZ6-UJbIAAIfv6.jfif

ఇదిలాఉంటే ఈ చిత్రానికి మైత్రి ఇన్ ల‌వ్ (MythriInLove) అంటూ మేక‌ర్స్ తాజాగా ఈ రోజు (సోమ‌వారం) ఉద‌యం ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసి త్వ‌ర‌లోనే టైటిల్ రివీల్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కాగా క్ష‌ణాల్లోనే ఈ పోస్టు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయింది. ఇది చూసిన వారు, శ్రీకాంత్ ఫ్యాన్స్ నూత‌న న‌టీన‌టుల‌కు అభినంద‌న‌లు తెలుపుతున్నారు.

Updated Date - Oct 12 , 2026 | 12:00 PM