నిన్న హనుమాన్ అంశ్.. ఇప్పుడు ప్రేమనే ఊరిలో! రికార్డుల ఊచకోత
ABN , Publish Date - Oct 11 , 2026 | 05:45 PM
వందల కోట్ల పాన్ ఇండియా హంగామా నడుస్తున్న వేళ, కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన చిన్న కన్నడ చిత్రం ‘ప్రేమద ఊరలి’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టిస్తోంది.
వందల కోట్ల పాన్ ఇండియా హంగామా నడుస్తున్న వేళ, కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన చిన్న కన్నడ చిత్రం ‘ప్రేమద ఊరలి’ (Premada Oorali) బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. మనోజ్ కుమార్ (Manoj Kumar) రచన, దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీరామ్ (Shreeraam), రంగాయన రఘు (Rangayana Raghu), తపస్విని పూనాచ (Thapaswini Poonacha), రమైక శివు (Ramika Shivu) ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగులో రెండు వారాల క్రితం ప్రేమనే ఊరిలో(Premane oorilo) విడుదలైన ఈ మూవీ ఇక్కడా పాజిటివ్ టాక్ తెచ్చుకుని విజయవంతంగా రన్ అవుతోంది. కానీ సరైన ప్రచారం లేక జనాలను పూర్తిగా రీచ్ కాలేక పోయింది.
తండ్రీకొడుకుల అమాయకత్వం, పల్లెటూరి స్వచ్ఛమైన కథతో తెరకెక్కిన ఈ ఫీల్ గుడ్ డ్రామా నేచురల్ ఎమోషన్స్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బలమైన మౌత్ టాక్‌ను సొంతం చేసుకుంటూ, ఫ్యామిలీ ఆడియన్స్ రాకతో ఏకంగా రూ.50 కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. ఇటీవల మన దగ్గర రవితేజ ఇరుముడి సినిమా విషయంలో జరిగినట్లుగానే కన్నడ నాట ఈ ప్రేమనే ఊరిలో చిత్రం అదేవిధమైన హంగామా చేసింది ఇంకా స్టడీగా కలెక్షన్లు కొల్లగొడుతుంది.
ఇక్కడ బలగం, ఇరుముడి సినిమాలకు పబ్లిక్ ఎడ్లబండ్లు కట్టుకుని కుటుంబాలకు కుటుంబాలు థియేటర్లకు ఎలా తరలివచ్చారో అదే తరహాలో ఈ చిత్రం బెంగళూరులో సునామీ సృష్టిస్తోంది. తెలుగులో కూడా ఈ చిత్రం డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఈ వారం థియేటర్లను సైతం పెంచారు. పెట్టిన పెట్టుబడికి 25 రెట్లు లాభాలు అందిస్తూ, ఈ ఏడాదిలోనే మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీగా ట్రేడ్ వర్గాల్లో సరికొత్త రికార్డు దిశగా అడుగులు వేస్తోంది. మున్ముందు ఈ మూవీ మరిన్ని రికార్డులు నమోదు చేయడం ఖాయంగా అనిపిస్తోంది.