Sigma: దుల్కర్ వదిలిన ‘సిగ్మా’ ఫస్ట్ సింగిల్ ఎలా ఉందంటే..
ABN, Publish Date - Jun 04 , 2026 | 09:21 PM
సందీప్ కిషన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తోన్న చిత్రం ‘సిగ్మా’. తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతోన్న ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది.
సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ (Lyca Productions Subaskaran) నిర్మిస్తోన్న చిత్రం ‘సిగ్మా’ (Sigma). తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ (Jason Sanjay) దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. తమన్ (S Thaman) బ్లాక్ బస్టర్ ఆల్బమ్ కంపోజ్ చేయగా.. తాజాగా హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ఫస్ట్ సింగిల్ ‘సిగ్మా స్టైల్’ను లాంచ్ చేసి యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ ఫస్ట్ సింగిల్ ఎలా ఉందంటే..
సంగీత దర్శకుడు తమన్ స్వయంగా కంపోజ్ చేసి ఆలపించిన ఈ ఎనర్జిటిక్ ట్రాక్ మాస్ బీట్‌లతో అలరిస్తోంది. థమన్ సిగ్నేచర్ స్టైల్ మ్యూజిక్, హై-వోల్టేజ్ రిథమ్స్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ, యూత్‌ని బాగా ఆకర్షిస్తున్నాయి. సందీప్ కిషన్ తన స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్, ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకోగా.. ఫరియా అబ్దుల్లా కూడా అదిరిపోయే డ్యాన్స్ స్టెప్స్‌తో పాటకు మరింత కలర్ తీసుకొచ్చింది. జేసన్ సంజయ్ రాసిన క్యాచీ లిరిక్స్, థమన్ మాస్ ట్యూన్, సందీప్ అండ్ ఫరియా డైనమిక్ పెర్ఫార్మెన్స్ కలిసి ఈ సాంగ్‌ను ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా నిలబెట్టాయి.
మరో విశేషం ఏమిటంటే.. ఈ సాంగ్‌లో దర్శకుడు జేసన్ సంజయ్ కూడా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. దీంతో ఈ సాంగ్‌పై, అలాగే సినిమాపై క్యూరియాసిటీ, ఎక్స్‌పెక్టేషన్స్ మరింతగా పెరిగాయి. రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తోన్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ఆడియో హక్కులను సరేగమా సొంతం చేసుకోగా, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ ఆఫర్‌కు దక్కించుకుంది.
ఇవి కూడా చదవండి:
మీరు నిజంగానే పోరాడారు.. ‘పెద్ది’పై పవన్ కళ్యాణ్ బ్యానర్ పోస్ట్!
‘డ్రాగన్’లోని ఆ సంచనాల కోసం వెయిటింగ్ -ఎన్టీఆర్
త్రిషకు మెగా కోడలు ఉపాసన స్పెషల్ సర్‌ప్రైజ్