Jason Sanjay: విజయ్‌ తనయుడు.. డైరెక్ట్ చేస్తున్న చిత్ర హీరో ఎవ‌రు?

ABN , Publish Date - Feb 25 , 2024 | 08:53 PM

త‌మిళ స్టార్ ద‌ళ‌ప‌తి విజయ్ కుమారుడు జాసన్‌ సంజయ్ మెగా ఫోన్‌ పట్టనున్నారు. ఆయన దర్శకత్వం వహించే తొలి చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుండ‌గా.. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ నిర్మాణ పనులు సాగుతున్నాయి.

Jason Sanjay: విజయ్‌ తనయుడు.. డైరెక్ట్ చేస్తున్న చిత్ర హీరో ఎవ‌రు?
vijay

త‌మిళ స్టార్ ద‌ళ‌ప‌తి విజయ్ (Thalapathi Vijay) కుమారుడు జాసన్‌ సంజయ్ (Jason Sanjay ) మెగా ఫోన్‌ పట్టనున్నారు. ఆయన దర్శకత్వం వహించే తొలి చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) నిర్మించనుండ‌గా.. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఇందులో నటించేందుకు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi), కవిన్ (Kavin)లతో సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి.

sanjay.jpg

కానీ, ఇపుడు ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి తనయుడు, హీరో దుల్కర్‌ సల్మాన్ (Dulquer Salmaan) కథానాయకుడిగా నటింపజేసేందుకు చర్చలు జరుగుతున్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ సినిమాకు యువన్‌ శంకర్‌ రాజా (Yuvan Shankar Raja) సంగీతం అందించనున్నారు.


కాగా, దుల్కర్‌ సల్మాన్ (Dulquer Salmaan) మలయాళ నటుడైనప్పటికీ.. తన నటనతో భాషా సరిహద్దులను చెరిపివేశారు. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లో నటిస్తున్నారు. ఆ కోవలోనే జాసన్‌ సంజయ్‌ దర్శకత్వం వహించే తొలి చిత్రంలో దుల్కర్‌(Dulquer Salmaan) ను తీసుకోనున్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన విడుదలకానుంది. అప్ప‌టివ‌ర‌కు హీరో ఎవ‌ర‌నేది స‌స్పెన్సే.

Updated Date - Feb 25 , 2024 | 08:53 PM