Sigma Storm: సందీప్ కిష‌న్ సినిమాలో.. సంజ‌య్ గెస్ట్ రోల్‌, స్పెష‌ల్ డ్యాన్స్ నంబ‌ర్‌

ABN , Publish Date - Dec 05 , 2025 | 06:55 PM

స్టార్ హీరో కొడుకు ఆయన... అందరూ హీరో అవుతాడని అనుకున్నారు... కానీ ఊహించని విధంగా మరో రోల్ తో తెరపైకి వచ్చాడు. అంతే కాదు... తన భాషలోనే కాకుండా మరో భాషలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కు ఎంత పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లోనూ ఆయనకు మంచి క్రేజ్ ఉంది. విజయ్ రాజకీయాల్లోకి వెళ్తుంటే.. ఆయన కుమారుడు జాసన్ సంజయ్ నట వారసుడిగా ఎంట్రీ ఇస్తాడని అందరూ ఊహించారు. కానీ అనూహ్యంగా ఈ కుర్రాడు మెగాఫోన్ పట్టాడు. త్వరలో దర్శకుడిగా తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టనున్నాడు.


జాసన్ ‘సిగ్మా’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ను రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కు భారీ స్పందన వచ్చింది. ఈ సినిమాలో బాలెన్స్ ఉన్న చివరి పాటను ఇటీవల చిత్రీకరించారు.

'సిగ్మా' సినిమాలో జాసన్ అతిథి పాత్ర చేయబోతున్నాడట. అంతేకాక ఈ చిత్రంలోని భారీ స్పెషల్ డాన్స్ నంబర్లో సందీప్ కిషన్‌తో కలిసి జాసన్ కూడా స్టెప్పులు వేశాడట ఈ స్పెషల్ సాంగ్ ను గ్లామరస్ బ్యూటీ కేథరీన్ థ్రెసాపై చిత్రీకరించారు. దీనికి తమన్ సంగీతం అందించాడు.

ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ మల్టీ లింగ్వెల్ ప్రాజెక్ట్, చెన్నై, తలకోన అడవులు, థాయిలాండ్‌లోని అద్భుతమైన ప్రదేశాలలో షూటింగ్ జరుపుకుంది. వచ్చే వేసవిలో 'సిగ్మా' సినిమా జనం ముందుకు రాబోతోంది. డెబ్యూ డైరెక్టర్ జాసన్ కెమియో ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Read Also: Samantha: పెళ్లి అయ్యి వారం కూడా కాలేదు.. అప్పుడే మొదలుపెట్టిన సమంత

Read Also: Actress Pragathi: ఏసియన్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు.. నటి ప్రగతి

Updated Date - Dec 05 , 2025 | 07:50 PM