‘జెట్లీ’ రిలీజ్ ట్రైలర్.. అన్‌ప్రెడిక్టబుల్!

ABN, Publish Date - Apr 30 , 2026 | 08:10 PM

కమెడియన్ సత్య, దర్శకుడు రితేష్ రానా కాంబో మరోసారి ‘జెట్లీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఈ మూవీ నుంచి రిలీజ్ ట్రైలర్‌ని మేకర్స్ వదిలారు.

కమెడియన్ సత్య (Satya), దర్శకుడు రితేష్ రానా (Ritesh Rana) కాంబో మరోసారి ‘జెట్లీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. యూనిక్ కథలతో, ఎంటర్‌టైన్‌మెంట్‌కు పెద్ద పీట వేస్తూ ఈ ద్వయం చేసే సందడి అంతా ఇంతా కాదు. ఈసారి భారీ స్థాయిలో, మరింత వినోదంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలతో మంచి బజ్ ఏర్పరచుకున్న ఈ చిత్రం మే 1న థియేటర్లలోకి వచ్చేందుకు అన్నిరకాలుగా సిద్ధమైంది. ఈ చిత్ర విడుదలను పురస్కరించుకుని తాజాగా మేకర్స్ రిలీజ్ ట్రైలర్‌ (Jetlee Release Trailer)ను విడుదల చేశారు.


ఈ ట్రైలర్‌ని గమనిస్తే.. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌లో కథను మిస్టరీగా ఉంచిన టీమ్, ఈ రిలీజ్ ట్రైలర్‌లో కథ కోర్ కాన్ఫ్లిక్ట్‌ ఏంటో తెలిసేలా చేశారు. కథ ప్రజాపతి అనే పర్సన్ చుట్టూ తిరుగుతుంది. మధ్యతరగతి కుటుంబాలని మోసం చేసి వారి డబ్బుని దోచుకుని దుబాయ్‌కు పారిపోయే ప్రజాపతిని పట్టుకోవడానికి ప్రభుత్వం ఒక సీక్రెట్ ఏజెంట్‌ని పంపుతుంది. కానీ ఈ మిషన్ మధ్యలోనే ఫ్లైట్‌లో అనూహ్యమైన గందరగోళంగా మారుతుంది. ఆ గందరగోళమే ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇస్తుందనేది ఈ ట్రైలర్ తెలియజేస్తోంది.


ముఖ్యంగా సత్య ఈ సినిమాలో సీరియస్‌నెస్, సిల్లీనెస్ మిక్స్ చేసి, ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించబోతున్నాడనేది ఈ ట్రైలర్ క్లారిటీ ఇచ్చేస్తోంది. టెన్షన్ సన్నివేశాల్లో కూడా తన టైమింగ్‌తో నవ్వులు పండిస్తూ, యాక్షన్ సీక్వెన్స్‌లలో కూడా అన్‌ప్రెడిక్టబుల్‌గా వినోదాన్ని పండిస్తున్నాడు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని ఇమిటేట్ చేసే సీన్ థియేటర్లలో హైలైట్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. రియా సింఘా గ్లామర్‌కే పరిమితం కాకుండా కథలో ఆమెది కూడా కీలక పాత్ర అనే విషయం ఈ ట్రైలర్ స్పష్టం చేస్తోంది. అజయ్ ప్రజాపతి పాత్రలో నెగటివ్ షేడ్స్‌తో కనిపిస్తుండగా, వెన్నెల కిషోర్, వైవా హర్ష తమ టైమింగ్‌తో నవ్వుల్ని రెట్టింపు చేశారు. టెక్నికల్‌గా సినిమాకు ఏమేం కావాలో, అన్నీ సమపాళ్లలో కుదిరినట్లుగా అర్థమవుతోంది. మొత్తానికి రిలీజ్ ట్రైలర్ చూస్తే ‘జెట్లీ’ ఒక ఫన్, ఫాస్ట్-పేస్డ్ చేజ్ డ్రామాగా, వినోదంతో కూడిన రైడ్‌గా ఉండబోతుందనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. మరెందుకు ఆలస్యం.. టికెట్స్ బుక్ చేయండిక!

ఇవి కూడా చదవండి:

‘ఇద్దరి నుంచి ముగ్గురుగా’.. తల్లికాబోతోన్న శ్రీ విష్ణు హీరోయిన్!

ప్రేమలో పూజా హెగ్డే.. కుర్రాడు కత్తిలా ఉన్నాడుగా!

‘భోగి’లో అనుపమ పరమేశ్వరన్.. ఫస్ట్ లుక్ మాములుగా లేదుగా!

కయాదు లోహర్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Updated at - Apr 30 , 2026 | 08:10 PM