Ritesh Rana Movie: కమెడియన్ సత్యకు జోడీగా.. మిస్ యూనివర్స్! సినిమా షురూ
ABN , Publish Date - Nov 08 , 2025 | 04:05 PM
సత్య, రియా సింఘా జంటగా నటిస్తున్న కొత్త సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. రితేష్ రాణా తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలు కాబోతోంది.
'మత్తు వదలరా' (Mathu Vadalara) ఫ్రాంచైజ్ రెండు చిత్రాలతో పాటు లావణ్య త్రిపాఠితో 'హ్యాపీ బర్త్ డే' మూవీ రూపొందించిన రితేష్ రాణా (Ritesh Rana) ఇప్పుడు మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు. విశేషం ఏమంటే ఈ సినిమాలో సత్య (Satya) హీరోగా నటిస్తుండగా, మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా (Rhea Singha) టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాను క్లాప్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నాలుగో చిత్రంగా చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ సినిమాకు ప్రెజెంటర్స్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ మూవీ గురించి దర్శకుడు రితేష్ రాణా మాట్లాడుతూ, 'మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా ఈ చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె పాత్ర కథలో కీలకంగా వుంటుంది. సత్యతో ఆమె జంటగా కనిపించడం ప్రేక్షకులకు ఒక ఫ్రెష్‌నెస్ ఇవ్వనుంది. 'మత్తు వదలరా' ఫ్రాంచైజీలో భాగమైన వెన్నెల కిషోర్, అజయ్ ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నారు' అని చెప్పారు. అధికారికంగా ఈ సినిమాను ప్రకటిస్తూ, మేకర్స్ ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. 'మత్తు వదలరా' టీం మరోసారి ఒక్కటవడంతో ప్రేక్షకుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. రితేష్ రాణా మార్క్ హ్యూమర్, క్రియేటివిటీతో కూడిన పూర్తి స్థాయి లాఫ్టర్ రయట్ కోసం సిద్ధమవుతున్నారు. రితేష్ రాణా గత హిట్లకు పని చేసిన కోర్ టెక్నికల్ టీం ఈ సినిమాకి వర్క్ చేస్తోంది. ఈ మూవీకి సంగీతం కాల భైరవ, సినిమాటోగ్రఫీ సురేష్ సరంగం, ఎడిటింగ్ కార్తిక శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైన్ నార్ని శ్రీనివాస్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం 'వైల్డ్, విట్టీ రైడ్ విత్ అన్ ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్స్' గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.
Also Read: Businessman: బిజినెస్‌మేన్ రీరిలీజ్ డేట్ ఫిక్స్
Also Read: Suma Kanakala: రాజీవ్ తో విడాకులు.. క్లారిటీ ఇచ్చిన సుమ