Jetlee Trailer: 15 వేల కోట్లు.. కడప కింగ్.. ‘జెట్లీ’ ట్రైలర్ ఎలా ఉందంటే?
ABN, Publish Date - Apr 22 , 2026 | 10:12 PM
కమెడియన్ సత్య.. ఈ పేరు ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ నేమ్. అవును, ఇప్పుడొస్తున్న ప్రతి సినిమా సత్య లేకుండా ఉండటం లేదు. అలాంటి సత్య.. ఇప్పుడు హీరోగా దర్శకుడు రితేష్ రానాతో మళ్లీ జతకట్టి చేస్తున్న చిత్రం ‘జెట్లీ’. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.
కమెడియన్ సత్య (Comedian Satya).. ఈ పేరు ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ నేమ్. అవును, ఇప్పుడొస్తున్న ప్రతి సినిమా సత్య లేకుండా ఉండటం లేదు. అలాంటి సత్య.. ఇప్పుడు హీరోగా దర్శకుడు రితేష్ రానా (Ritesh Rana)తో మళ్లీ జతకట్టి చేస్తున్న చిత్రం ‘జెట్లీ’ (Jetlee). వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మరోసారి క్విర్కీ, డిఫరెంట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించబోతుందని ప్రామిస్ చేస్తోంది. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. మే 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందు రాబోతున్న సందర్భంగా.. చిత్ర థియేట్రికల్ ట్రైలర్ బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు.
ఈ ట్రైలర్‌ని గమనిస్తే.. ఇందులో సత్య పోషిస్తున్న పాత్ర చాలా వైవిధ్యంగా అనిపిస్తోంది. జ్ఞాపకశక్తి కోల్పోయిన ఒక వ్యక్తిగా, తనను తాను వెతుక్కుంటూ వింత పరిస్థితుల్లో ఉన్నట్లుగా సత్యని ఇందులో చూపించారు. కానీ తన ప్రశ్నలకు సమాధానాలు దొరకడం బదులుగా, చుట్టూ ఉన్నవారి నుంచి సెటైర్లు ఎదురవుతుంటాయి. రియాలిటీ, పర్సెప్షన్ మధ్య ఉన్న కాంట్రాస్ట్. అందరికీ సత్య ఒక కమెడియన్‌లా కనిపించినా, తాను మాత్రం పెద్ద యాక్షన్ హీరోలా బిహేవ్ చేస్తుంటాడు. 15 వేల కోట్లు, కడప కింగ్.. ఇలా రకరకాల పదాలు ఇందులో వినిపిస్తాయి. యాక్షన్ సీన్స్ కూడా సీరియస్‌గా కాకుండా, ప్యారడీ టచ్‌తో ఉండటం ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు.
సత్య తన సహజమైన స్టైల్‌లో అండర్‌ప్లే పెర్ఫార్మెన్స్‌తో నవ్వులు పండిస్తుండగా.. వెన్నెల కిశోర్, వైవా హర్ష అతనికి, ఈ సినిమాకు మరింత ఎంటర్‌టైన్ జోడించారనే విషయం ఈ ట్రైలర్ తెలియజేస్తోంది. రియా సింగ్ గ్లామర్‌తో పాటు యాక్షన్‌లో కూడా ఆకట్టుకుంటోంది. దర్శకుడు రితేష్ రానా సరదాగా ఎంటర్‌టైన్ చేయడానికి, నవ్వులు పంచడానికి చేసిన వినూత్న ప్రయత్నమిదని చెప్పుకోవచ్చు. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. సురేష్ సారంగం విజువల్స్, కాల భైరవ సంగీతం ఈ ట్రైలర్‌ని మరింత ఎలివేట్ చేస్తున్నాయి. మొత్తంగా అయితే ఈ ట్రైలర్ సినిమాపై భారీగానే అంచనాలను పెంచేస్తోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
చిరంజీవి ఇంటికి సమీపంలోనే అల్లు అర్జున్ లగ్జరీ హౌస్.. ఎన్ని కోట్లంటే?
అలా విమర్శించే వారిని వదలకండి: చంద్రబాబుకు బండ్ల సూచన
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి సినిమాల్లోకి వచ్చిన సెలబ్రిటీలు వీరే!
Updated at - Apr 22 , 2026 | 10:12 PM