Jetlee Glimpse: ఇంతకీ నువ్వు హీరోవా...టైర్ వన్నా..టూ నా..త్రీ నా
ABN , Publish Date - Jan 03 , 2026 | 07:05 PM
మత్తు వదలరా(Mathu Vadalara) సినిమా కమెడియన్ సత్య (Satya) ను ఓవర్ నైట్ స్టార్ గా మార్చింది అని చెప్పొచ్చు.
Jetlee Glimpse: మత్తు వదలరా(Mathu Vadalara) సినిమా కమెడియన్ సత్య (Satya) ను ఓవర్ నైట్ స్టార్ గా మార్చింది అని చెప్పొచ్చు. ఇక మత్తు వదలరా 2 లో అతడే హీరో అన్నట్లు నెటిజన్స్ చూసారు. ఈ రెండు సినిమాల వలన సత్యక్రేజ్ బాగా పెరిగింది. ఆ సినిమా సమయంలోనే డైరెక్టర్ రితేష్ రానా (Ritesh Rana).. తన తదుపరి సినిమాలో సత్యనే హీరో అని చెప్పుకొచ్చాడు. ఆ మాటను నిలబెట్టుకుంటూ రితేష్.. సత్యతో జెట్లీ అనే సినిమాను మొదలుపెట్టాడు. క్లాప్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై చెర్రీ, హేమలత పదమల్లు నిర్మిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తున్నారు.
ఇక జెట్లీ సినిమాలో సత్య సరసన మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింఘా హీరోయిన్ గా నటిస్తోంది. వెన్నెల కిషోర్, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా జెట్లీ ఫస్ట్ గ్లింప్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు . గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మత్త వదలరాని మించి సత్య .. జెట్లీతో నవ్వించబోతున్నట్లు తెలుస్తోంది.
మేడిపండు చూడు మేలిమై ఉండు అనే పద్యాన్ని సత్య బ్యాక్ గ్రౌండ్ లో చెప్తుంటే.. ఫ్లైట్ లో జరిగే యాక్షన్ మొత్తాన్ని గ్లింప్స్ లో చూపించారు. ఒక విమానం.. హైజాక్ అవ్వడం, అందులో ఉన్నవారందరిని సత్యతో కలిసి రియా కాపాడడం కథగా తెలుస్తోంది. ఆ ఫ్లైట్ లోనే మొత్తం సినిమా నడిపించినట్లు తెలుస్తోంది. అసలు సత్య ఎవరు.. ? ఆ ఫ్లైట్ లో ఉన్నవారందరిని కాపాడాడనికి ప్రయత్నిస్తున్నాడా.. ? లేక హైజాక్ చేసిందే అతనా.. ? అనేది మిస్టరీగా కట్ చేశారు.
ఇక పద్యంలో చివరన విశ్వదాభి రామ.. ఇంతకీ నేను ఎవరినిరా మామ అనే డైలాగ్ తో సత్య మెంటల్ కండిషన్ కూడా డౌట్ లో పడేశారు. వెన్నెల కిషోర్ పాత్ర హైలైట్ అవ్వనుందని తెలుస్తోంది. కాల భైరవ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్. గ్లింప్స్ తోనే సినిమాపై అంచనాలను క్రియేట్ చేశాడు రితేష్ రానా. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో సత్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.