ప్రేమలో పూజా హెగ్డే.. కుర్రాడు కత్తిలా ఉన్నాడుగా!

ABN , Publish Date - Apr 29 , 2026 | 09:33 PM

బుట్ట బొమ్మ పూజా హెగ్డే ప్రేమలో పడిందా? అంటే.. బాలీవుడ్ వర్గాల్లో అవుననే మాటే వినిపిస్తోంది. కొన్ని రోజులుగా ఆమె ఓ కుర్రాడితో చెట్టాపట్టాలేసుకుని కనిపిస్తుండటంతో, ఆమెపై ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Pooja Hegde and Rohan Mehra

బుట్ట బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) ప్రేమలో పడిందా? అంటే.. బాలీవుడ్ వర్గాల్లో అవుననే మాటే వినిపిస్తోంది. కొన్ని రోజులుగా ఆమె ఓ కుర్రాడితో చెట్టాపట్టాలేసుకుని కనిపిస్తుండటంతో, బాలీవుడ్ మీడియా వర్గాలు.. ఆమె ప్రేమలో పడిందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుందంటూ వార్తలు వైరల్ చేస్తున్నారు. ఈ వార్తలు చూసిన ఆమె అభిమానులు, ఆమెను ప్రేమలో పడేసిన కుర్రాడు ఎవరా? అని సెర్చింగ్ మొదలెట్టారు. ఈ సెర్చింగ్‌లో బయటికి వచ్చిన పేరే రోహన్ మెహ్రా (Rohan Mehra). అవును, గత కొంతకాలంగా రోహన్‌తో పూజా హెగ్డే రిలేషన్‌లో ఉన్నట్లుగా టాక్ నడుస్తోంది. అందుకు కారణం వీరిద్దరూ పలు ప్రదేశాల్లో కలిసి కనిపించడమే.


ఇదే టైమ్ అనుకుని, అసలు వీళ్లద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటా అని, వీరి పాత ఇన్‌స్టా పోస్ట్‌లు కూడా తిరగేస్తున్నారు. అలా తిరగేస్తుంటే అసలు విషయం బయటకు వచ్చింది. పూజా హెగ్డే బర్త్‌డే‌ని పురస్కరించుకుని రోహన్ చేసిన ఇన్‌స్టా పోస్ట్‌ని వైరల్ చేస్తూ.. వాళ్లిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లుగా వార్తలు క్రియేట్ చేస్తున్నారు. ఆ వార్తలకు తగినట్టే.. ఇద్దరూ రెస్టారెంట్స్‌‌కు వెళుతూ మీడియాకు చిక్కుతున్నారు. వాస్తవానికి వీరిద్దరూ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. మరి ఎలా వీరికి పరిచయమైందనే కోణంలో కూడా బాలీవుడ్ మీడియా.. ఒక ముందడుగు వేసేసింది. వీరిద్దరికి ఉన్న కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం ఏర్పడి, ఆ పరిచయం రిలేషన్ వరకు దారితీసిందట. త్వరలోనే వీరిద్దరూ తమ మధ్య ఉన్న రిలేషన్‌ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కథనాలు రాస్తున్నారు. చూద్దాం, మరి ఏం జరుగుతుందో?


ఇదిలా ఉంటే, పూజా హెగ్డే ఫ్యాన్స్.. రోహన్ మెహ్రాపై మరోలా రియాక్ట్ అవుతుండటం విశేషం. కుర్రాడు కత్తిలా ఉన్నాడు.. పూజాకు సరైన జోడు.. అంటూ ఇద్దరూ కలిసున్న ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దుమ్మురేపిన పూజాకు ఇప్పుడు అవకాశాలే లేకుండా పోయాయి. ప్రస్తుతం ‘జననాయగన్’ సినిమాతో పాటు దుల్కర్‌తో చేస్తున్న సినిమా మాత్రమే ఆమె చేతిలో ఉన్నాయి. బాలీవుడ్‌లో మాత్రం ఈ భామ బిజీ నటిగానే కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి:

కయాదు లోహర్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

మంగ్లీపై అసత్య ప్రచారం.. అసభ్యకర పోస్టులు చేస్తున్నారు

Theater Movies: ఈ వారం.. థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతున్న‌ సినిమాలు

చందమామకు సెకండ్ ఇన్నింగ్స్.. సెట్ అవుతుందా

Updated Date - Apr 29 , 2026 | 09:33 PM

Pooja Hegde : ఆ కోరిక ఇప్పుడైనా తీరబోతోందా?

Pooja Hegde : బెదిరింపు కాల్స్‌పై టీమ్‌ క్లారిటీ!

Pooja Hegde: అంతకు మించే ఉంటుంది 

Pooja Hegde: ఆ గౌరవాన్ని దూరం చేశారు.. ‘జననాయగన్’ లీక్‌పై పూజా హెగ్డే

Pooja Hegde: ఆ స్టార్ హీరో చెంప చెళ్లుమనిపించా.. బుట్టబొమ్మ సంచలన వ్యాఖ్యలు