Jetlee: సత్య జెట్లీ కాదు.. రితేష్ రానా కామెడీ ఎక్కడా తగ్గలేదు

ABN , Publish Date - Nov 14 , 2025 | 06:56 PM

టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా దూసుకుపోతున్నాడు సత్య (Satya). మత్తు వదలరా ప్రాంచైజీతో సత్యకు స్టార్ డమ్ వచ్చింది అని చెప్పాలి.

Jetlee

Jetlee: టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా దూసుకుపోతున్నాడు సత్య (Satya). మత్తు వదలరా ప్రాంచైజీతో సత్యకు స్టార్ డమ్ వచ్చింది అని చెప్పాలి. రితేష్ రానా (Ritesh Rana) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యేసుదాసు పాత్రలో సత్య నటించాడు అనడం కంటే జీవించాడు అని చెప్పొచ్చు. హీరో శ్రీసింహా కంటే సత్యకె ఎక్కువ పేరు వచ్చింది. మత్తు వదలరా 2 ప్రమోషన్స్ లోనే డైరెక్టర్ రితేష్ రానా.. సత్యను మెయిన్ హీరోగా పెట్టి ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చాడు.

ఇక రితేష్ ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈ మధ్యనే తన 4వ సినిమాకు సత్యనే హీరోగా ప్రకటించాడు. టాలీవుడ్ లో కమెడియన్స్ ఎవరు హీరోలుగా సక్సెస్ అందుకోలేదు. అంతెందుకు అంతకుముందు సత్య కూడా వివాహ భోజనంబు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. దీంతో హీరోగా కంటే ఎక్కువ కామెడీ మీదనే దృష్టిపెట్టాడు.

ఇక చాలా గ్యాప్ తరువాత రితేష్ రానా మీద నమ్మకంతో సత్య మళ్లీ హీరోగా మారాడు. నేడు బాలల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు. రితేష్ రానా - సత్య కాంబోలో వస్తున్నా ఈ సినిమాకు జెట్లీ అనే టైటిల్ ను ఖరారు చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కూడా రితేష్ రానా తన కామెడీ టైమింగ్ ను వదలలేదు. జెట్ మీద నిలబడి సత్య బ్రూస్ లీ లా ఫోజు ఇచ్చాడు. ఇక టైటిల్ పైన సత్య ఈజ్ నాట్ జెట్లీ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా ఇక కామెడీ నాతో కాదు అని సత్య చెప్పినట్లు ట్యాగ్ లైన్ ఇచ్చాడు. టోటల్ గా పోస్టర్ ను బట్టి ఇదొక కామెడీ ఎంటర్ టైనర్ అని, మత్తు వదలరా 2 ని మించి వినోదం ఉండబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. మరి ఈ సినిమాతో సత్య హీరోగా హిట్ అందుకుంటాడా లేదా చూడాలి.

Updated Date - Nov 14 , 2025 | 06:56 PM