సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Irumudi Glimpse: మందు మానేయ్ నాన్న..! గ్లింప్స్ ఎలా ఉందంటే

ABN, Publish Date - Jun 03 , 2026 | 02:28 PM

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఇరుముడి’. తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.

మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కమర్షియల్ మాస్ ఎంటర్‌టైమెంట్‌తో పాటు కుటుంబ భావోద్వేగాలు, ఆధ్యాత్మికత, డ్రామా అంశాలను సమపాళ్లలో మేళవిస్తూ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ (Irumudi Glimpse)ను మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ హార్ట్ టచింగ్‌గా ఉండటమే కాకుండా.. ఎమోషనల్‌గా ఉంది. ఈ గ్లింప్స్‌ని గమనిస్తే..

రవితేజ, బేబి నక్షత్రల మధ్య ఉన్న తండ్రీ కూతుళ్ల బాండింగ్‌ని ఈ గ్లింప్స్ తెలియజేస్తోంది. ఫస్ట్ సన్నివేశం నుంచి ఎంతో ఎమోషనల్‌గా సాగిన ఈ గ్లింప్స్.. చివరకు మాత్రం ఓ మాస్ రైడ్‌ని పరిచయం చేసింది. ఆ మాస్ రైడ్ అనంతరం ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ ఆధ్యాత్మికత వైపు దర్శకుడు తీసుకెళ్లారు. తాగుబోతుగా ఉన్న రవితేజను కుమార్తె ఎలా మార్చింది? అసలెందుకు రవితేజ అలా మారాడు. యాక్షన్ నుంచి డివోషన్ వైపు రవితేజ మారడానికి కారణం ఏమై ఉంటుందనే ఆసక్తిని క్రియేట్ చేయడంలోనూ, తండ్రీకూతుళ్ల ఎమోషనల్ బాండింగ్‌ని తెలియజేయడంలోనూ ఈ గ్లింప్స్ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి.


యాక్షన్, ఎమోషన్, డివోషన్ కలగలిసిన ఈ సినిమా రవితేజ కెరీర్‌లో మరో ప్రత్యేక చిత్రంగా నిలవనుందనే విషయం ఈ గ్లింప్స్ తెలియజేస్తోంది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, స్వాసిక తదితరులు ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

‘పెద్ది’ పోరాటానికి తెలంగాణలోనూ లైన్ క్లియర్! పెరిగిన టికెట్ల ధరలు

NBK 111: ‘నో మోర్‌ వింటేజ్‌, ఓన్లీ న్యూ ఏజ్‌’.. సరికొత్త అవతారంలో బాలయ్య

Blast Zone : అర్జున్ సర్జా బ్లాస్ట్ జోన్ మూవీ రివ్యూ

Updated Date - Jun 03 , 2026 | 02:28 PM