Raviteja - Shiva Nirvana: రవితేజతో.. ఆరుగురు హీరోయిన్లు! మ్యాట‌రేంటంటే

ABN , Publish Date - Dec 02 , 2025 | 02:30 PM

రవితేజ ప్రస్తుతం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఆయన శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే!

Raviteja



రవితేజ (Ravi teja)ప్రస్తుతం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఆయన శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే! ఈ సినిమా పట్టాలెక్కక ముందే దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలోవైరల్ అవుతోంది . అయితే దీనిని చిత్ర బృందం ఖండించింది.  శివ నిర్వాణ - రవితేజ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో ఆరుగురు హీరోయిన్లు ఉన్నట్లు కొన్ని రోజులుగా వార్త వైరల్‌ అవుతోంది. ఈ వార్తలన్నీ ఫేక్‌ అని స్పష్టం చేసింది నిర్మాణ సంస్థ. ఇలాంటి వాటిని నమ్మొద్దని, ఏదైనా అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.  

 
ప్రస్తుతం రవితేజ నటిస్తున్న 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని సంక్రాంతికి విడుదల కానుంది. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్‌, డింపుల్‌ హయాతి నాయికలు.

Updated Date - Dec 02 , 2025 | 03:13 PM