Shiva Nirvana: నేను ఎవరికీ అభిమానిని కాదు.. కానీ ఆమెకు అభిమానిని అని చెప్పుకుంటా..

ABN , First Publish Date - 2023-08-16T16:39:00+05:30 IST

నేను ఇంత వరకు ఎవరి అభిమానిని అని చెప్పలేదు. కానీ సమంత అభిమానిని అని చెప్పుకుంటాను అని అన్నారు దర్శకుడు శివ నిర్వాణ. విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. సెప్టెంబర్ 1న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర మ్యూజిక్ కన్సర్ట్‌ని మంగళవారం హైదరాబాద్‌లో మేకర్స్ ఘనంగా నిర్వహించారు.

Shiva Nirvana: నేను ఎవరికీ అభిమానిని కాదు.. కానీ ఆమెకు అభిమానిని అని చెప్పుకుంటా..
Director Shiva Nirvana

నేను ఇంత వరకు ఎవరి అభిమానిని అని చెప్పలేదు. కానీ సమంత అభిమానిని అని చెప్పుకుంటాను అని అన్నారు దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana). విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’ (Kushi). మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాణంలో దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 1న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మేకర్స్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో మ్యూజిక్ కన్సర్ట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ మ్యూజిక్ కన్సర్ట్‌లో ‘ఖుషి’ సినిమాలోని సాంగ్స్‌ను (Kushi Movie Songs) సింగర్స్ జావెద్ అలీ, సిధ్ శ్రీరామ్, మంజూష, చిన్మయి, సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ పాడి ఆకట్టుకున్నారు. (Kushi Music Concert)


ఈ సందర్భంగా డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ.. ‘ఖుషి’ సినిమా చూసేందుకు థియేటర్స్‌కు వెళ్లిన పెళ్లైన జంటలు, పెళ్లి కాని వారు, లైఫ్‌లో పెళ్లి చేసుకోకూడదని అనుకునే వారు.. అందరూ ఈ సినిమా చూశాక తమ లవ్ లైఫ్‌లోని మెమొరీస్‌ని షేర్ చేసుకుంటారు. ప్రేమగా హగ్ చేసుకుంటారు. సినిమా అంతా మీకు విజయ్, సమంత కాకుండా విప్లవ్, ఆరాధ్య కనిపిస్తారు. ఇదొక కొత్త కథ, ట్విస్ట్‌లు, టర్న్‌లు ఉంటాయని నేను చెప్పను. కానీ మీ మనసుకు హత్తుకునేలా ఉంటుంది. నాకు పెళ్లై నాలుగేళ్లయ్యింది. నా వైఫ్‌తో నేను ప్రేమగా, కోపంగా, సంతోషంగా, బాధగా ఉన్న సందర్భాలన్నీ నాకు తెలియకుండానే ఈ సినిమాలో రిఫ్లెక్ట్ అయ్యాయి. (Shiva Nirvana Speech at Kushi Music Concert)

Kushi.jpg

‘ఖుషి’ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఇంకోసారి సినిమాకు వెళ్దామని అనిపిస్తుంది. ఏ ఇబ్బందీ లేకుండా ఫ్యామిలీ అంతా మా సినిమాను చూడొచ్చు. సినిమా పూర్తయ్యాక నాకొక మంచి ఫ్యామిలీ ఉందని మీ మీద మీకే ఒక ఇష్టం ఏర్పడుతుంది. ఈ కథను అనుకున్నట్లు తెరకెక్కించేందుకు నాకు దొరికిన రెండు డైమండ్స్ విజయ్, సమంత. ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) చూశాక విజయ్ మీద ఏర్పడిన ప్రేమంతా ఈ సినిమాలో చూపించాను. నేను ఎవరి అభిమానిని అని చెప్పలేదు. కానీ సమంత అభిమానిని అని చెప్పుకుంటా. ‘ఖుషి’లో రెండున్నర గంటలు ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ.. అని చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

***************************************

*Klin Kaara Konidela: ఫస్ట్ ఇండిపెండెన్స్‌ డే.. జెండా ఆవిష్కరించిన క్లీంకార

***************************************

*Vishwak Sen: ఊహించిందే జరిగింది.. పెళ్లి లేద్.. ఏం లేద్..

***************************************

*The Soul Of Satya: సాయిధరమ్ తేజ్, స్వాతి.. జీవించేశారు

***************************************

*Bhagavanth Kesari: బాలయ్య విలన్ పని అయిపోయింది

***************************************

*The Vaccine War: అన్ని మాటలు చెప్పారు.. ‘సలార్’కి పోటీగానే దింపుతున్నారుగా..

***************************************

Updated Date - 2023-08-16T16:39:00+05:30 IST