NBK 111: ‘నో మోర్‌ వింటేజ్‌, ఓన్లీ న్యూ ఏజ్‌’.. సరికొత్త అవతారంలో బాలయ్య

ABN , Publish Date - Jun 03 , 2026 | 08:02 AM

‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న భారీ యాక్షన్‌ చిత్రం ‘ఎన్‌బీకే111.

NBK 111

‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), దర్శకుడు గోపీచంద్‌ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న భారీ యాక్షన్‌ చిత్రం ‘ఎన్‌బీకే111 (NBK111) (వర్కింగ్‌ టైటిల్‌)’ షూటింగ్‌ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వృద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై వెంకట సతీశ్‌ కిలారు నిర్మిస్తున్నారు.

అయితే బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 10న ఓ భారీ అప్డేట్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. భారీ ఎన్‌బీకే అక్షరాలు ఇనుప గొలుసులతో బంధించినట్లుగా కనిపిస్తూ, బాలయ్య పవర్‌ను ప్రెజెంట్‌ చేస్తున్నాయి. ‘నో మోర్‌ వింటేజ్‌, ఓన్లీ న్యూ ఏజ్‌’ అనే ట్యాగ్‌లైన్‌ బాలకృష్ణను సరికొత్త అవతారంలో చూపించబోతున్న సంకేతాలు ఇస్తోంది.

nbk.jfif

మరోవైపు ఈ సినిమాలో తాను కూడా భాగమవుతున్నట్లు ఇటీవలే మంచు మనోజ్ (Manchu Manoj) ప్రకటించారు. కథలో కీలకమైన, పవర్‌ఫుల్‌ పాత్రలో మనోజ్‌ కనిపించనున్నారు. కాగా, మాస్‌ ఎంటర్‌టైనర్లను తెరకెక్కించడంలో తనదైన ముద్ర వేసిన గోపీచంద్‌ మలినేని, మరోసారి బాలయ్య అభిమానుల కోసం హైవోల్టేజ్‌ యాక్షన్‌తోపాటు బలమైన భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Updated Date - Jun 03 , 2026 | 08:07 AM