సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Suriya: విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌.. కొత్త రిలీజ్‌ డేట్‌..

ABN, Publish Date - May 28 , 2026 | 03:39 PM

‘కరుప్పు’ సక్సెస్‌తో మంచి జోష్‌ మీదున్నారు సూర్య. అభిమానులకు రెట్టింపు ఆనందం పంచేలా తదుపరి చిత్రం అప్‌డేట్‌ను ఇచ్చారు.

‘కరుప్పు’ సక్సెస్‌తో మంచి జోష్‌ మీదున్నారు సూర్య (Suriya) అభిమానులకు రెట్టింపు ఆనందం పంచేలా తదుపరి చిత్రం అప్‌డేట్‌ను ఇచ్చారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ (Vishwanath And Sons) . వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య  నిర్మాతలు. గురువారం ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. ఆగస్టు 14న వరల్డ్‌వైడ్‌ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలుత ఈ చిత్రాన్ని జులైలో విడుదలను ఆగస్ట్‌కు మార్చారు.

కుటుంబ కథా చిత్రంగా రూపొందుతున్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన సూర్య వింటేజ్‌ లుక్‌ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది. ఈ చిత్రంలో సూర్యకు జోడీగా మమితా బైజు నటిస్తున్నారు. రవీనా టాండన్, రాధిక శరత్‌కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు  జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, నిమిష్ రవి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా, బంగ్లాన్ కళా దర్శకుడిగా పనిచేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - May 28 , 2026 | 03:39 PM