Mahesh Babu: నాన్ స్టాప్.. యాక్షన్‌లోకి మహేష్ బాబు?
ABN , Publish Date - May 28 , 2026 | 04:26 PM
వారణాసి ..ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే టాలీవుడ్‌తో పాటు గ్లోబల్ లెవెల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం వారణాసి (Varanasi). ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే టాలీవుడ్‌తో పాటు గ్లోబల్ లెవెల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్యాన్ వరల్డ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండటం విశేషం. అలాగే మలయాళ ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకూమారన్ విలన్‌గా నటిస్తూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తున్నారు. ఈ ముగ్గురి కలయికతో సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోవడంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఈ విజువల్ వండర్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు తన కెరీర్‌లోనే మునుపెన్నడూ లేని విధంగా మారిపోయాడు. రాజమౌళి సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్లు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అందుకే మహేష్ బాబులోని నటనను స్క్రీన్ ప్రెజెన్స్‌ను జక్కన్న సరికొత్త కోణంలో ఆవిష్కరించబోతున్నారని, ఈ చిత్రం సూపర్ స్టార్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అభిమానులు నమ్ముతున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజమౌళి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ సెట్టింగ్స్, అధునాతన వి ఎఫ్ ఎక్స్ (VFX) స్టూడియోలతో పాటు రియల్ లొకేషన్స్ లో కూడా షూటింగ్‌ను ప్లాన్ చేశారు. చిత్ర యూనిట్ అన్ని విభాగాల్లోనూ ఎంతో ప్రతిష్టాత్మకంగా వర్క్ చేస్తోంది. సినిమా క్వాలిటీ అద్భుతంగా రావడం కోసం టెక్నికల్ పరంగా అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇటు మహేష్ బాబు కూడా జక్కన్న విజన్‌కు తగ్గట్టుగా సరికొత్త మేకోవర్‌తో ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
ఈ తరుణంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. మేకర్స్ ప్రస్తుతం ఒక లాంగ్ యాక్షన్ షెడ్యూల్‌ను ప్రారంభించినట్టు తెలుస్తోంది. దాదాపు ఒక నెల రోజుల పాటుగా నాన్‌స్టాప్‌గా ఈ యాక్షన్ సీక్వెన్స్ షూట్ జరగనుందని సమాచారం. హాలీవుడ్ స్థాయి స్టంట్ మాస్టర్స్ పర్యవేక్షణలో రాబోయే ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈ ఒక్క నెల మొత్తం మన సూపర్ స్టార్ కంప్లీట్ యాక్షన్ మోడ్‌లోనే ఉంటారని స్పష్టమవుతోంది.
ఇక ఈ భారీ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, కే.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్యాన్ వరల్డ్ లెవెల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ అప్‌డేట్‌తో మహేష్ బాబు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.