విజయ్, శౌర్యువ్ ప్రాజెక్ట్.. ‘ధట్స్ ఏ రోర్’ లిరికల్ వీడియో చూశారా!
ABN , Publish Date - Apr 19 , 2026 | 08:55 PM
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, ‘హాయ్ నాన్న’ ఫేమ్ డైరెక్టర్ శౌర్యువ్ కాంబినేషన్‌లో హ్యూజ్ గ్లోబల్ ప్రాజెక్ట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మేకర్స్ మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), ‘హాయ్ నాన్న’ ఫేమ్ డైరెక్టర్ శౌర్యువ్ (Director Shouryuv) కాంబినేషన్‌లో హ్యూజ్ గ్లోబల్ ప్రాజెక్ట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై కొన్ని రోజులుగా వార్తలు అయితే వినిపించాయి కానీ, అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. సడెన్‌గా మేకర్స్ ఈ ప్రకటనతో సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇంటర్నేషల్ టెక్నీషియన్స్ ఈ మూవీకి వర్క్ చేస్తుండగా.. వైరా బ్యానర్ నిర్మిస్తోంది. ఈ ప్రెస్టీజియస్ మూవీకి సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఇంకా వైరల్ అవుతుండగానే మేకర్స్ మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాలోని విజయ్ దేవరకొండ చేస్తున్న పాత్రను ఎలివేట్ చేస్తూ, ‘ధట్స్ ఏ రోర్’ (That’s a Roar Lyrical Video) అంటూ ఓ ర్యాప్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో విజయ్ దేవరకొండ ఒక పవర్ ఫుల్, ఎనర్జిటిక్ లుక్‌లో కనిపిస్తున్నారు.
ఈ పాట సాహిత్యం అంతా.. హీరో తనకున్న కష్టాలను, అవమానాలను ఎదుర్కొని.. ఎలా విజయం వైపు అడుగులు వేస్తున్నాడో తెలిపేలా ఉంది. విజయ్ దేవరకొండ బ్లాక్ డాగ్స్‌తో చాలా స్టైలిష్‌గా, పవర్ ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇంగ్లీష్‌లో ఉన్న ఈ ర్యాప్.. కేవలం పాట మాత్రమే అని చెప్పుకోలేం.. స్ఫూర్తినిచ్చే సాహిత్యంతో.. హీరో పాత్రకు ఉన్న ఎమోషన్స్, పోరాటాన్ని తెలిపే ఒక గర్జన అని చెప్పుకోవచ్చు.ఈ పాటలో హీరో తన బాధను ఎలా శక్తిగా మలుచుకుంటున్నాడో, ఎవరిని అడగకుండా సొంతంగా ఎలా ఎదిగాడో చెబుతున్నారు. ఈ పాట చూస్తుంటే, ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో తెలుస్తోంది. విజయ్ కోసం దర్శకుడు శౌర్యువ్ ఓ అద్భుతమైన కథని సిద్ధం చేసినట్లుగా అయితే ఈ పాట క్లారిటీ ఇస్తోంది. ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నట్లుగా ఇప్పటికే చిత్రబృందం తెలియజేసింది.
ఇవి కూడా చదవండి:
సబ్‌స్క్రిప్షన్ వార్తలపై అనన్య నాగళ్ల క్లారిటీ ఇదే!
SIFPA: ఏకపక్ష నిర్ణయాలకు చెక్.. సినీ పరిశ్రమను కాపాడుకునే దిశగా నిర్మాతలు!
Raasi: మహేష్ ‘నిజం’ సినిమాలోని పాత్రపై రాశి షాకింగ్ కామెంట్స్!
పెళ్లికి సిద్ధమైన శృతిహాసన్.. ఆ లక్కీ వరుడు ఎవరో?