సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘ది ప్యారడైజ్’ హీరో క్లాప్‌తో.. విజయ్, శౌర్యువ్ చిత్రం ప్రారంభం

ABN, Publish Date - Apr 20 , 2026 | 07:50 PM

‘గీత గోవిందం’, ‘అర్జున్ రెడ్డి’ చిత్రాల టైమ్‌లో విజయ్ దేవరకొండ పేరు ఎలా వినిపించిందో.. ఇప్పుడు మరోసారి ఆయన పేరు అలా వైరల్ అవుతోంది. అందుకు కారణాలేంటో తెలుసా?

Vijay Deverakonda Shouryuv Film Launch

‘గీత గోవిందం’, ‘అర్జున్ రెడ్డి’ చిత్రాల టైమ్‌లో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) పేరు ఎలా వినిపించిందో.. ఇప్పుడు మరోసారి ఆయన పేరు అలా వైరల్ అవుతోంది. అందుకు కారణం.. ఇటీవల నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna)తో పెళ్లి ఒకటైతే, ఆయన వరసగా అనౌన్స్ చేస్తున్న ప్రాజెక్ట్స్ మరో కారణంగా నిలుస్తున్నాయి. విజయ్, రష్మికల పెళ్లి‌పై దాదాపు నెల రోజుల పాటు ఏదో రకంగా వార్తలు వినిపిస్తూనే వచ్చాయి. పెళ్లి అనంతరం వారిద్దరూ సినిమా షూటింగ్స్‌పై ఫోకస్ పెట్టారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న ‘రణబాలి’ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అదే టైమ్‌లో ‘రౌడీ జనార్ధన’ అనే మూవీ ప్రకటన కూడా వచ్చింది. ఈ రెండు ప్రాజెక్ట్‌తో పాటు ఇప్పుడు విజయ్ దేవరకొండ చేయబోతున్న మూడో ప్రాజెక్ట్ కూడా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. రెండు రోజులుగా వార్తలలో నిలుస్తున్న విజయ్ దేవరకొండ, ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ (Shouryuv) కాంబో చిత్రం.. సోమవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. వైరా బ్యానర్ ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని నిర్మిస్తోంది. ముహూర్తపు సన్నివేశానికి ‘ది ప్యారడైజ్’ (The Paradise) హీరో నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) క్లాప్ కొట్టారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఇక ఈ చిత్రానికి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నట్లుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్, ఫాల్ ఔట్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన అలెజాండ్రో మార్టినెజ్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా బాధ్యతలు నిర్వహిస్తుండగా.. ‘గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్, బ్యాట్ మ్యాన్ ఫరెవర్, స్నోపియర్సర్’ చిత్రాల వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ ఎరిక్ డస్ట్ర్ ఈ మూవీకి పనిచేస్తున్నారు. ‘యానిమల్, ఓం శాంతి ఓం’ వంటి చిత్రాలకు పనిచేసిన సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, పలు సూపర్ హిట్ చిత్రాల కంపోజర్ హేషమ్ అబ్దుల్ వాహాబ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. ఇండియన్ సినిమాకు గ్లోబల్ స్థాయి క్రేజ్ తీసుకురావడంలో ‘వారణాసి, రాకా’ చిత్రాలు ఎలా అయితే పోటీ పడుతున్నాయో.. ఆ జాబితాలో ఈ మూవీ కూడా ఉంటుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. మైథాలజికల్ యూనివర్స్ బ్యాక్ డ్రాప్‌లో, ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా ఈ సినిమా దర్శకుడు తెరకెక్కించబోతున్నాడని నిర్మాణ సంస్థ తెలియజేసింది.

ఇవి కూడా చదవండి:

అప్పటి వరకూ నాకు విశ్రాంతి లేదు: పవన్ కళ్యాణ్ విష్‌కు చంద్రబాబు స్పందనిదే!

సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి సినిమాల్లోకి వచ్చిన సెలబ్రిటీలు వీరే!

సబ్‌స్క్రిప్షన్ వార్తలపై అనన్య నాగళ్ల క్లారిటీ ఇదే!

Raasi: మహేష్ ‘నిజం’ సినిమాలోని పాత్రపై రాశి షాకింగ్ కామెంట్స్!

Updated Date - Apr 20 , 2026 | 07:50 PM