సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సీమ గడ్డపై రౌడీ హీరో భావోద్వేగం.. ‘రణబాలి’ రణభేరిలో స్పీచ్ అదిరింది

ABN, Publish Date - Oct 24 , 2026 | 07:09 AM

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటించిన భారీ పాన్-ఇండియా చిత్రం ‘రణబాలి’. ఈ చిత్ర సక్సెస్‌ను పురస్కరించుకుని అనంతపురంలో ‘రణబాలి రణభేరి’ సక్సెస్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.

Vijay Deverakonda

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రశ్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటించిన భారీ పాన్-ఇండియా చిత్రం ‘రణబాలి’ (Ranabaali). ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ విజయవంతంగా థియేటర్లలో దూసుకెళుతోంది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ-సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాకు వస్తున్న భారీ స్పందనతో చిత్ర యూనిట్ అనంతపురంలో ‘రణబాలి రణభేరి’ (Ranabaali Ranabheri) సక్సెస్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు, చెప్పిన డైలాగులు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘‘తెలుగు గడ్డ ఎంతో గొప్పది, అందమైనది, ఎంతో చరిత్ర ఉన్న నేల. నేను పుట్టిన తెలంగాణలో ఒక ఆవేశం, తిరగబడే ధైర్యం ఉంటుంది. ఆంధ్ర వెళ్తే ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి మనుషులు, ఆప్యాయత ఉంటాయి. ఇక సీమ విషయానికి వస్తే ‘రణబాలి’లో ‘రాయలేలిన సీమ గడ్డ.. పాలేగాళ్లే నడిచిన దుర్గం.. మచ్చాలేని సింగనమల.. పౌరుషానికే పుట్టిన నేల’ అంటూ నాలుగు లైన్ల పాట ఉంటుంది. ఆ పాట సీమ ఔన్నత్యాన్ని కళ్లకు కడుతుంది. ఈ రాయలసీమ నాకు ఎంతో ఇచ్చింది. నేను చదువుకున్నది పుట్టపర్తిలోనే. కొత్తచెరువు అనే ఊర్లోని థియేటర్‌లో వుడెన్ బెంచీలపై కూర్చొని సినిమాలు చూసేవాడిని. ఈరోజు అదే కొత్తచెరువు థియేటర్‌లో ‘రణబాలి’ హౌస్‌ఫుల్స్‌తో నడుస్తుంటే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేను. కర్నూలు, అనంతపురం, కడప మీదుగా నా ప్రయాణం సాగింది. అందుకే ‘రణబాలి’ని కేవలం నటుడిగా చేయలేదు. నాకు ఇంత ప్రేమను పంచిన ఈ గడ్డ రుణం తీర్చుకోవాలనే బాధ్యతతో చేశాను’’ అని చెప్పారు.


స్థానిక ప్రజల నుంచి వచ్చిన స్పందనను గుర్తుచేసుకుంటూ.. ‘‘ఒక పెద్దాయన నా చేయి పట్టుకుని ‘బిడ్డా మా తరం కష్టాలు, మా వీరుల కథ చూపించావు’’ అని అంటుంటే కలిగిన తృప్తి ఏ అవార్డులూ, ఏ డబ్బూ ఇవ్వలేవు. బాక్సాఫీస్ సినిమాకు ఒక విలువ ఇస్తుంది కానీ, మీరు ఇచ్చే ప్రేమ జీవితానికి అర్థాన్నిస్తుందని అన్నారు. అనంతరం అభిమానుల కోరిక మేరకు అనంతపురం వేదికపై రాయలసీమ యాసలో డైలాగ్ పేల్చారు. ‘నువ్వారా మా తాత చెప్పిన కరువు రాక్షసుడివి.. నా మొలతాడుతో ముక్కుతాడు గట్టి.. ఈ మద్రాస్ తీరాన్ని నీ రక్తంతో ఎరుపు రంగు ఎక్కిస్తా.. నిన్ను, నీ రాణిని, దాని జాతి మొత్తాన్ని పుట్టపర్తి పరసలో పండబెట్టి నరకకపోతే.. వాణక్క నా పేరు సింగనమల బొబ్బిలి రణబాలి కాదు!’ అంటూ గర్జించడంతో.. వేదికంతా కేరింతలతో మార్మోగింది.

దర్శకుడు రాహుల్ సంకృత్యన్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. మేము ‘అర్జున్ రెడ్డి’ చేసినప్పుడు ఎంత గొప్ప సినిమా తీశామో మాకే అర్థం కాలేదు. పదేళ్ల తర్వాత సందీప్‌కి, నాకు దాని స్థాయి తెలిసింది. రాహుల్.. నువ్వు ఈరోజు ఎంత గొప్ప చిత్రం తీశావో, దీనికి రాబోయే పేరు, ప్రేమ రానున్న ఐదేళ్లలో నీకే అర్థమవుతుందని పేర్కొన్నారు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్‌తో ‘డియర్ కామ్రేడ్’, ‘ఖుషి’ తర్వాత ఇది తన మూడో చిత్రమని, నిర్మాత రవిశంకర్ కథ వినగానే పరిగెత్తుకుంటూ వచ్చి తనకు చెప్పారని తెలిపారు.


చిత్రంలో ‘జయమ్మ’గా నటించిన రశ్మిక మందన్న గురించి మాట్లాడుతూ.. రశ్మికతో పనిచేయడం ఏ దర్శకుడికైనా, నటుడికైనా అదృష్టం. ఎనిమిదేళ్లుగా ఆమెను చూస్తున్నాను, తనలో కోపం గానీ, చెడు ఆలోచన గానీ ఎప్పుడూ చూడలేదు. సెట్‌లో అందరికీ ఎంతో కేరింగ్‌గా ఉంటుంది. ప్రమోషన్స్ పూర్తయి, సింగనమల సెట్ నుంచి వెళ్తుంటే సినిమా టీమ్‌ను, జయమ్మను, ఆ సీమ యాస డైలాగులను ఎంతగానో మిస్ అయ్యాను. ఆ సమయంలో రష్మికకు మెసేజ్ చేశా.. ‘ఇంకా నయ్యం నిన్ను పెళ్లి చేసేసుకున్నా.. ఇంకో వారంలో ఎట్లైనా ఇంటికే వస్తావు.. లేకపోతే చాలా మిస్ అయ్యేవాడిని’ అని చెప్పా.. అంటూ విజయ్ చేసిన వ్యాఖ్యలు ఈవెంట్‌లో నవ్వులు పూయించాయి. ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ జిష్ణు, నటీమణులు ఈశ్వరి రావు, వినోద్ కిషన్, మహాలింగం, ఫైట్ మాస్టర్లకు విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. పదేళ్లుగా తనపై ఇంతటి ప్రేమను కురిపిస్తున్న తెలుగు ప్రేక్షకుల కోసం త్వరలోనే మరో అదిరిపోయే సినిమాతో వస్తానని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

బాలయ్యకు పోటీగా యంగ్ హీరో.. ఆ సూపర్ స్టారే ఆదర్శమా..

‘మిస్టర్ దెయ్యం’కు మంచు మనోజ్ సపోర్ట్.. ఏం చేశారంటే

ముంబైలో మరోసారి కలకలం.. బిగ్ బి ఇంటికి బాంబు బెదిరింపు

Updated Date - Oct 24 , 2026 | 07:13 AM