ముంబైలో మరోసారి కలకలం.. బిగ్ బి ఇంటికి బాంబు బెదిరింపు

ABN , Publish Date - Oct 23 , 2026 | 06:06 PM

అసలు బాలీవుడ్‌లో ఏం జరుగుతోంది? నిన్న కాక మొన్న ముంబై జూహు పరిధిలో ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్ వాహనంపై గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఇప్పుడు మరో వార్త ముంబైని వార్తల్లో హైలెట్ చేస్తోంది.

Big B and Tiger Shroff

అసలు బాలీవుడ్‌లో ఏం జరుగుతోంది? నిన్న కాక మొన్న ముంబై జూహు పరిధిలో ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) వాహనంపై గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఆ షాక్ నుంచి సినీ పరిశ్రమ, ప్రజలు ఇంకా కోలుకోకముందే.. ఇప్పుడు మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Big B Amitabh Bachchan) నివాసంతో పాటు ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జీత్ దోసాంజ్ (Diljit Dosanjh) రాబోయే మ్యూజిక్ కాన్సర్ట్ వేదికను పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. వరుస ఘటనలతో ముంబైలో అసలు సినీ తారల భద్రత పరిస్థితి ఏంటి? అనే ఆందోళన మొదలైంది.


బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారిక ఈమెయిల్‌కు ఈ బెదిరింపు సందేశం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. జూహులోని అమితాబ్ బచ్చన్ వ్యక్తిగత బంగ్లా ‘జల్సా’తో పాటు, నవంబర్ 27న ముంబైలో జరగనున్న దిల్జీత్ దోసాంజ్ లైవ్ కాన్సర్ట్ వేదికను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడతామని ఆ మెయిల్‌లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ మెయిల్ అందుకున్న వెంటనే అప్రమత్తమైన బీఎంసీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) మనీష్ కల్వానియా సైతం బీఎంసీకి బెదిరింపు మెయిల్ వచ్చిన విషయాన్ని ధ్రువీకరించారు.


సమాచారం అందుకున్న వెంటనే ముంబై పోలీసులు, బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (బీడీడీఎస్) రంగంలోకి దిగాయి. అమితాబ్ బచ్చన్ నివాసం ‘జల్సా’తో పాటు కాన్సర్ట్ నిర్వహించే ప్రదేశంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్ల సహాయంతో అనుమానాస్పద ప్రాంతాలను జల్లెడ పట్టారు. ప్రాథమిక తనిఖీల అనంతరం ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని, ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే, నగరంలో వరుసగా ప్రముఖులను టార్గెట్ చేస్తున్న పరిణామాల నేపథ్యంలో ముంబై అంతటా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ నకిలీ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనుక ఉన్నదెవరు? అనే కోణంలో సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తును వేగవంతం చేసింది.

ఇవి కూడా చదవండి:

‘ఒకే ఒక జీవితం’ డైరెక్టర్ శ్రీ కార్తిక్‌తో రుక్మిణి వసంత్‌ భారీ ప్రాజెక్ట్

యన్టీఆర్‌-త్రివిక్రమ్ పౌరాణిక చిత్రంపై క్రేజీ అప్డేట్

ప్రభాస్ కోసం ‘మిరాయ్’ డైరెక్టర్ మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్

Updated Date - Oct 23 , 2026 | 06:06 PM

‘కిల్లర్’ సెకండాఫ్ ట్విస్ట్ చెప్పండి.. రూ. కోటి గెలుచుకోండి: దర్శకుడు పూర్వాజ్

అల్లు అర్జున్‌కి అర్ధరాత్రి విజయ్ దేవరకొండ ఫోన్.. అసలేం జరిగిందంటే

‘డ్యూన్ 3’ దెబ్బకు ‘ద ఒడిస్సీ’ రికార్డ్ బద్దలైంది

చొక్కా నలగకుండా రూ. 500 కోట్లు.. సూపర్‌స్టార్‌కే సాధ్యం: అల్లు అర్జున్

స్టార్ హీరోతో ప్రభుదేవా సినిమా.. దర్శకుడిగా టాలీవుడ్‌ రీఎంట్రీ