‘మిస్టర్ దెయ్యం’కు మంచు మనోజ్ సపోర్ట్.. ఏం చేశారంటే

ABN , Publish Date - Oct 23 , 2026 | 06:54 PM

శౌర్య ఆర్య సమర్పణలో అన్నే క్రియేషన్స్ బ్యానర్‌పై వెంకట్ నిమ్మలపూడి, సింధు అన్నే నిర్మిస్తున్న సరికొత్త చిత్రం ‘మిస్టర్ దెయ్యం’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.

Mr Deyyam Movie Launch

శౌర్య ఆర్య సమర్పణలో అన్నే క్రియేషన్స్ బ్యానర్‌పై వెంకట్ నిమ్మలపూడి, సింధు అన్నే నిర్మిస్తున్న సరికొత్త చిత్రం ‘మిస్టర్ దెయ్యం’ (Mr Deyyam) పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. విజయ్ శంకర్ (Vijay Shankar), సిరి చౌదరి (Siri Chowdary), ఖయ్యూమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ వినూత్న హారర్ కామెడీ చిత్రానికి సంజన అన్నే (Sanjana Anne) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ లాంచ్ ఈవెంట్‌కు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరై.. చిత్ర బృందానికి తన పూర్తి మద్దతును ప్రకటించారు. ముహూర్తపు సన్నివేశానికి మంచు మనోజ్ (Manchu Manoj) క్లాప్ కొట్టగా, ప్రముఖ నటుడు అలీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు విజయ్ కనకమేడల ఫస్ట్ షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించగా, సీనియర్ దర్శకులు వీఎన్ ఆదిత్య, ఆర్పీ పట్నాయక్ మేకర్స్‌కు స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ వేడుకకు పట్నం మహేందర్ రెడ్డి, రమేష్ పుప్పాల, సమీర్, చింటు, వీర శంకర్, రాజా వన్నెం రెడ్డి, జ్యోత్స, లేబర్ కమిషనర్ గంగాధర్, కొరియోగ్రాఫర్ విజయ్ పోలకి తదితరులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.


ఈ సందర్భంగా దర్శకురాలు సంజన అన్నే మాట్లాడుతూ.. తమ చిత్రం ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మీడియా ఎప్పటిలాగే తమ సినిమాకు అండగా నిలవాలని కోరారు. హీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ.. ఇదొక ఔట్ అండ్ ఔట్ కామెడీతో పాటు ఇప్పటివరకు ఎవరూ చూడని సరికొత్త హారర్ ఎలిమెంట్స్‌తో కూడిన బెస్ట్ హారర్ మూవీగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నటుడు ఖయ్యూమ్ ఈ చిత్రంలో తానొక మంచి పాత్రను పోషిస్తున్నానని, ఎప్పటిలాగే ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. పింగ్ పాంగ్ సూర్య మాట్లాడుతూ, ఈ చిత్రం ప్రేక్షకులను భయపెడుతూనే కడుపుబ్బా నవ్విస్తుందని పేర్కొన్నారు.


హీరోయిన్ సిరి చౌదరి ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతూ, నవంబర్ మొదటి వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని స్పష్టం చేశారు. మంచు మనోజ్ క్లాప్ కొట్టి ప్రోత్సహించడంతో పాటు టాలీవుడ్ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ‘మిస్టర్ దెయ్యం’ ప్రారంభంలోనే మంచి బజ్‌ను సొంతం చేసుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను భయపెడుతూ అలరించేలా రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే పూర్తి వివరాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి:

ముంబైలో మరోసారి కలకలం.. బిగ్ బి ఇంటికి బాంబు బెదిరింపు

‘ఒకే ఒక జీవితం’ డైరెక్టర్ శ్రీ కార్తిక్‌తో రుక్మిణి వసంత్‌ భారీ ప్రాజెక్ట్

యన్టీఆర్‌-త్రివిక్రమ్ పౌరాణిక చిత్రంపై క్రేజీ అప్డేట్

Updated Date - Oct 23 , 2026 | 06:54 PM

అమితాబ్ బచ్చన్‌కు ఏమైంది? ఆరోగ్యంపై బిగ్ బీ పోస్ట్.. అభిమానుల్లో ఆందోళన

‘వృషకర్మ’ పోస్టర్‌లో డివైన్ వైబ్స్.. నాగచైతన్య ఇంటెన్స్ లుక్ అదుర్స్

హద్దుల్లో ఉండండి: బాడీ షేమింగ్ ట్రోలర్స్‌పై పాయల్ రాజ్‌పుత్ ఫైర్

పెద్ద సినిమాలు ఉన్నప్పుడు చిన్న సినిమాలు వస్తే.. జరిగేది ఇదే

తల లేని మొండెంతో.. ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్ అదిరింది