ఆదర్శ కుటుంబం వాయిదా..

ABN , Publish Date - Aug 30 , 2026 | 05:14 PM

విక్టరీ వెంకటేష్ - త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న చిత్రం ఆదర్శ కుటుంబం. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా నారా రోహిత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Aadarsha Kutumbam

విక్టరీ వెంకటేష్ (Venkatesh) - త్రివిక్రమ్ (Trivikram) కాంబోలో వస్తోన్న చిత్రం ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbam). ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా నారా రోహిత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లిమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 2 న రిలీజ్ చేయడానికి మేకర్స్ ముందుగానే ప్లాన్ చేశారు. దానికి తగ్గట్లుగానే రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆదర్శ కుటుంబం అనుకున్న సమయానికి రావడం లేదని తెలుస్తోంది.


ముందుగా అనుకున్న అక్టోబర్ 2 విడుదల తేదీన ఈ సినిమా రావడం లేదని సమాచారం. ఇంకా షూట్ ఫినిష్ కాకపోవడంతో ఈ సినిమాని వాయిదా వేసినట్లు టాక్. ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ బ్యాలెన్స్ ఉందని.. అలాగే ఓ సాంగ్ కూడా షూట్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. సెప్టెంబర్ రెండో వారంలో సాంగ్ షూట్ చేయనున్నారట. ఇంత వర్క్ బ్యాలెన్స్ ఉండడంతో అక్టోబర్ 2 కి సినిమాను రిలీజ్ చేయలేమని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పుడున్న సమాచారం ప్రకారం సినిమాను అక్టోబర్ 9కి వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అది కుదరకపోతే అక్టోబర్ 16న విడుదల చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.


వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడం, దానికి తోడు టైటిల్ ప్రకటించినప్పటి నుంచి ఉన్న భారీ అంచనాల వల్ల ఈ సినిమాపై బిజినెస్ పరంగానూ మంచి క్రేజ్ నెలకొంది. ఎస్. తమన్ సంగీతం మరింత హైప్ తీసుకొచ్చింది. త్రివిక్రమ్ మార్క్ సంభాషణలు, వెంకటేష్ ఫ్యామిలీ ఎమోషన్స్ మిళితమై రానున్న ఈ చిత్రంపై అభిమానులు భారీగా అంచనాలను పెట్టుకున్నారు. కొత్త డేట్ తో వస్తోన్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Aug 30 , 2026 | 05:14 PM