Aadarsha Kutumbam: నువ్వు అందిన చోటల్లా అప్పు చేయ్.. నేను పప్పు చేస్తా

ABN , Publish Date - Sep 12 , 2026 | 04:27 PM

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ల్యాండ్‌మార్క్ చిత్రం ఆదర్శ కుటుంబం.

Aadarsha Kutumbam

విక్టరీ వెంకటేష్ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ల్యాండ్‌మార్క్ చిత్రం ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbam). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోండగా నివేతా పేతురాజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లిమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.


టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. చిట్టిబాబు ఒక మధ్యతరగతి వ్యక్తి. నిత్యం అప్పులు చేసే భార్య.. చదువురాని కొడుకు.. ఆ అప్పులను, కుటుంబాన్ని భరిస్తూ ఉద్యోగం చేసే చిట్టిబాబుకు అనుకోకుండా లాటరీ తగిలి ఒక్కసారిగా కోటీశ్వరుడుగా మారిపోతాడు. ఇక అక్కడకు వెళ్ళాక ఆ కుటుంబంలో వచ్చిన మార్పులు ఏంటి.. ? చిట్టిబాబుకు ఎదురైన సమస్యలు ఏంటి.. ? అనేది సినిమా కథగా తెలుస్తోంది. ఇక టీజర్ లో వెంకటేష్ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 'నాకు ఫ్యామిలీ ఇమేజ్ ఉందని తెలుసు.. కానీ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే యాక్షన్ చేయడానికి వెనుకాడను', 'నదికట్టు దాటితే వరదంటారు.. సముద్రం దాటితే ఉప్పెనంటారు.. కానీ సామాన్యుడు హద్దు దాటితే బలమైన పదం.. స్ట్రాంగ్ సౌండ్ వస్తుంది' అనే డైలాగ్స్ గురూజీ పంచ్ డైలాగ్స్ ని గుర్తుచేస్తున్నాయి.


వెంకటేష్ కామెడీ టైమింగ్, సరికొత్త యాక్షన్ మేకోవర్‌తో పాటు తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు ప్రధాన బలంగా నిలిచాయి. టీజర్ లో గురూజీ మార్క్ కనిపించింది అని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎలిమెంట్స్‌ కలగలిపి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమాతో వెంకీ- త్రివిక్రమ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Updated Date - Sep 12 , 2026 | 04:27 PM