వరుణ్ సందేశ్ వైఫ్ మిస్సింగ్.. సెర్చింగ్ స్టార్ట్!
ABN, Publish Date - May 11 , 2026 | 04:03 PM
వరుణ్ సందేశ్ వైఫ్ మిస్సింగ్.. అనగానే నిజంగానే ఆయన భార్య మిస్సయ్యారా? అని షాకవుతున్నారేమో.. అలాంటిదేమీ లేదు. వారిద్దరూ బాగానే ఉన్నారు.
వరుణ్ సందేశ్ (Varun Sandesh) వైఫ్ మిస్సింగ్.. అనగానే నిజంగానే ఆయన భార్య మిస్సయ్యారా? అని షాకవుతున్నారేమో.. అలాంటిదేమీ లేదు. వారిద్దరూ బాగానే ఉన్నారు. టైటిల్‌లో ఉన్న విషయం ఏమిటంటే.. వరుణ్ సందేశ్ హీరోగా చేయబోతోన్న చిత్రానికి ‘నా వైఫ్ మిస్సింగ్’ (Naa Wife Missing) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై ఆహా సమర్పణలో శివ కంఠంనేని, ఆర్ వెంకటేశ్వర రావు నిర్మిస్తోన్న చిత్రం ‘నా వైఫ్ మిస్సింగ్’. ఇటీవలే ‘నయనం’ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న స్వాతి ప్రకాష్ మంత్రిప్రగడ దర్శకత్వంలో.. సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్‌లో ఒక చక్కటి ప్రేమ కథగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రవీణ్, మోహిత్, సత్య శ్రీ (జబర్దస్త్) తదితరులు కీలకపాత్రలు పోషించనున్నారు.
ఇటీవలే ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభించారు. ఆహా బృందం స్క్రిప్ట్ అందించగా.. సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ ఫస్ట్ క్లాప్ కొట్టారు. నటుడు, నిర్మాత, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అశోక్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. దర్శకుడు, జాతీయ అవార్డ్ గ్రహీత నీలకంఠ తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. మే 11వ తేదీ నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైనట్లుగా మేకర్స్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర అప్డేట్స్, మిస్ అయిన వైఫ్ ఎవరు? అనే విషయాలు త్వరలోనే చిత్ర బృందం తెలియజేయనుంది.
ఈ చిత్రానికి టాలెంటెడ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నట్లుగా మేకర్స్ తెలిపారు. సతీష్ కుమార్ ఎన్ఎస్ సినిమాటోగ్రఫీ, సాయి బాబు తలారి ఎడిటింగ్, ఎన్నో చిత్రాలకు హిట్ మ్యూజిక్ అందించిన సాయి కార్తీక్ సంగీతం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఉమర్జీ అనురాధ ఈ చిత్ర కథను అందించగా, శ్రీనివాస్ మండల స్క్రీన్‌ప్లే రైటర్‌గా వ్యవహరించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి రాబోయే అప్డేట్స్.. ఆసక్తికరంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
‘అండర్ రేటెడ్’ నటిగా చూస్తున్నారా? పాయల్ రాజ్‌ఫుత్ సమాధానమిదే!
Raghava Theater: ఈ థియేటర్‌లో ఫస్ట్, లాస్ట్ సినిమా ఎన్టీఆర్‌దే.. భావోద్వేగంలో ఫ్యాన్స్!
త్రిష లేకుంటే విజయ్ జాతకం మరోలా ఉండేది- వేణు స్వామి
Ranabaali: హార్స్ రైడింగ్ గ్లింప్స్.. విజయ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్!