Varun Sandesh - Vithika: దారుణమైన పరిస్థితిని చూశాం!

ABN , First Publish Date - 2023-03-30T21:06:18+05:30 IST

హ్యాపీ డేస్‌’ యూత్‌ఫుల్‌ హిట్‌ సొంతం చేసుకున్న వరుణ్‌ సందేశ్‌ తదుపరి ‘కొత్త బగారరులోకం’ చిత్రం స్టార్‌గా ఎదిగారు. అయితే ఆ తర్వాత సరైన విజయం అందుకోలేదు.

Varun Sandesh - Vithika: దారుణమైన పరిస్థితిని చూశాం!

హ్యాపీ డేస్‌’ *Happy Days Varun sandesh) యూత్‌ఫుల్‌ హిట్‌ సొంతం చేసుకున్న వరుణ్‌ సందేశ్‌ తదుపరి ‘కొత్త బంగారులోకం’ చిత్రం స్టార్‌గా ఎదిగారు. అయితే ఆ తర్వాత సరైన విజయం అందుకోలేదు. అయినా హిట్‌ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేశారు. హీరోయిన్‌ వితికా శేరును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఓంకార్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓ షోలో తాజాగా ఈ జంట యాంకర్‌ ఓంకార్‌ హోస్ట్‌ గా చేస్తున్న ఓ టీవీ కార్యక్రమానికి ఈ జంట అతిథులుగా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. కెరీర్‌లో వీరిద్దరు ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్పుకొచ్చారు. ఓంకార్‌ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు వరున్‌ సందేశ్‌.

‘‘నేను చేసిన కొన్ని చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం (Failure stories) వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది. కథల ఎంపికలో ఎక్కడో పొరపాటు జరిగింది. ఇవన్నీ తట్టుకోలేక కుటుంబ సభ్యులతో అమెరికా వెళ్లిపోవాల్సి వచ్చింది’’ అన్నారు. (Varun Tej Problems)

వరుణ్‌ భార్య వితికా శేరు కూడా మాట్లాడారు. ‘‘మేమిద్దరం ఒకే ఆలోచన కలిగిన వాళ్లం. ఒకరినొకరు సంతోషంగా ఉంచడానికే చూస్తాం. అందుకే ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఎదుర్కొని నిలబడ్డాం. ఏదో చేేసయాలి.. కార్లు, భవంతులు కొనేయాలి. ఏదో ఐపోవాలి ఆనే కోరికలు మాకు లేవు. ఒకరి ఆలోచనలను ఒకరు గౌరవించుకుని ముందుకెళ్తాం. కెరీర్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఒకానొక సమయంలో చేతిలో రూ.5 వేలు కూడా లేని దారుణ పరిస్థితిని చూశాం’’ అని భావోద్వేగానికి గురయ్యారు వితికా. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం వరుణ్‌ సందేశ్‌ వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. గతేడాది ‘ఇందువదన’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. తాజాగా సందీప్‌ కిషన్‌ ‘మైఖేల్‌’ సినిమాలో ఓ కీలక పాత్రతో మెప్పించారు. త్వరలో ‘చిత్రం చూడర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వితికా శేరు అప్పుడప్పుడు పలు షోల్లో దర్శనమిస్తున్నారు. తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఆసక్తికర వీడియోలు పోస్ట్‌ చేస్తుంటారు.

Updated Date - 2023-03-31T09:00:55+05:30 IST