సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘వారణాసి’.. జక్కన్నా, ఈ వార్తలు నిజమేనా?

ABN, Publish Date - Nov 18 , 2026 | 05:19 PM

ప్రస్తుతం ఇండియన్ సినిమా నుంచే కాదు.. యావత్ ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ అందరూ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే.. అది ఒకే ఒక్క సినిమా.. ‘వారణాసి’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో వార్త వైరల్ అవుతోంది.

Varanasi Release Update

ప్రస్తుతం ఇండియన్ సినిమా నుంచే కాదు.. యావత్ ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ అందరూ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే.. అది ఒకే ఒక్క సినిమా.. అదే సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), గ్లోబల్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (Varanasi). ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ తర్వాత జక్కన్న డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావడంతో, దీనిపై ఉన్న హైప్ ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అయితే గత కొంతకాలంగా రిలీజ్ డేట్‌పై ఒక స్పష్టత వచ్చిందని అనుకుంటున్న సమయంలో.. ఇప్పుడు టాలీవుడ్‌లో మళ్లీ ఒక కొత్త చర్చ మొదలైంది. అసలు అనుకున్న టైమ్‌కి సినిమా వస్తుందా..? లేదా వాయిదా పడుతోందా..? అని.


‘వారణాసి’ సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ, అసలైన సవాలు ఇప్పుడే మొదలైంది. రాజమౌళి సినిమా అంటే తెరపై కనిపించే ప్రతి ఫ్రేమ్ ఒక అద్భుతంలా ఉండాలి. ముఖ్యంగా గ్లోబల్ ట్రావెల్ అడ్వెంచర్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాకి సంబంధించి వీఎఫ్ఎక్స్, సీజీ వర్క్స్ అత్యంత కీలకం. హాలీవుడ్ స్థాయి విజువల్స్ అందించాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ స్థాయి స్టూడియోలతో కలిసి పనిచేస్తున్నారు. అయితే ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుకున్న సమయం కంటే మరింత ఎక్కువ వ్యవధి పట్టేలా కనిపిస్తోంది. క్వాలిటీ విషయంలో రాజమౌళి అస్సలు రాజీ పడరు అన్న సంగతి అందరికీ స్పష్టంగా తెలిసిన విషయమే. ఫ్రేమ్ పర్ఫెక్ట్‌గా వచ్చే వరకు ఆయన విశ్రమించరు. అందుకే ముందుగా అనుకున్నట్టు ఏప్రిల్ నాటికి అన్ని పనులూ పూర్తి చేసి విడుదల చేయడం కష్టమే అన్న అభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ఏప్రిల్ మిస్ అయితే సినిమా ఎప్పుడు వస్తుంది..? ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. టీమ్ ఒక కొత్త విండోను లాక్ చేసే పనిలో పడింది. అదే ఆగస్ట్ నెల. సమ్మర్ సీజన్ మిస్ అయినప్పటికీ, ఆగస్ట్ కూడా బిగ్ మూవీస్ రిలీజ్‌కి మంచి గోల్డెన్ పీరియడ్. అందుకే, బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు రాబట్టేందుకు ఇది సరైన సమయంగా భావిస్తున్నారట. అంతేకాదు, వీఎఫ్ఎక్స్ పనులన్నింటినీ ఎలాంటి తొందరపాటు లేకుండా అత్యుత్తమ క్వాలిటీతో పూర్తి చేయడానికి ఈ నాలుగైదు నెలల అదనపు సమయం దర్శకుడికి బాగా ఉపయోగపడుతుంది.


ఒకవేళ ఏప్రిల్ నుంచి ఆగస్ట్‌కి సినిమా షిఫ్ట్ అయితే.. ఫ్యాన్స్ మొదట కాస్త నిరాశ చెందడం సహజమే. కానీ కాస్త లోతుగా ఆలోచిస్తే.. సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా ఒక బ్లాక్‌బస్టర్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి! ఎందుకంటే ఆగస్ట్ 9న మహేష్ బాబు పుట్టినరోజు (Mahesh Babu Birthday). ఒకవైపు సూపర్ స్టార్ బర్త్‌డే సంబరాలు, మరోవైపు రాజమౌళి మార్క్ గ్లోబల్ సినిమా రిలీజ్.. రెండూ ఒకే నెలలో కలిసొస్తే బాక్సాఫీస్ దగ్గర థియేటర్లలో జరిగే జాతర ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆ సందడి, సెలబ్రేషన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంటాయి. ఆలస్యమైనా సరే, వరల్డ్ క్లాస్ సినిమాను తమ హీరో పుట్టినరోజు కానుకగా థియేటర్లలో చూడడం ఫ్యాన్స్‌కు ఇచ్చే కిక్కే వేరు. అయితే ఇవన్నీ ప్రస్తుతం సోషల్ మీడియా, ఇండస్ట్రీ వర్గాల్లో వస్తున్న వార్తలు మాత్రమే. మరి ఈ ఊహాగానాలకు, రిలీజ్ సస్పెన్స్‌కు జక్కన్న టీమ్‌ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి. ఫ్యాన్స్‌ కూడా జక్కన్న ఇచ్చే ఆ అప్‌డేట్‌ కోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

‘రామాయణ’కు తక్కువ ఫుట్‌ఫాల్స్.. భారీ కలెక్షన్స్.. ఎలా సాధ్యమైంది?

ఈషా రెబ్బాతో తరుణ్ భాస్కర్ బంధంపై గీతా భాస్కర్ క్లారిటీ.. అదీ విషయం

‘ది ఏజ్ ఆఫ్ భారత్’ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ మరో అడుగు

Updated Date - Nov 18 , 2026 | 05:19 PM