ఈషా రెబ్బాతో తరుణ్ భాస్కర్ బంధంపై గీతా భాస్కర్ క్లారిటీ.. అదీ విషయం

ABN , Publish Date - Nov 18 , 2026 | 03:31 PM

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.

Geetha Bhascker about Tharun Eesha Relation

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker), హీరోయిన్ ఈషా రెబ్బా (Eesha Rebba) మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా వారిద్దరూ కలిసి అనేకానేక సందర్భాల్లో కనిపించి.. మీడియాకు కావాల్సినంత పని పెట్టేశారు. అయితే ఇప్పటివరకు వీరిద్దరూ తమ బంధంపై ఎక్కడా నేరుగా స్పందించలేదు. కానీ తాజాగా ‘ఈ నగరానికి ఏమైంది రీపీట్’ (ENE Repeat) ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేదికగా తరుణ్ భాస్కర్ తల్లి గీతా భాస్కర్ (Geetha Bhascker) చేసిన ఎమోషనల్ స్పీచ్‌తో వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై పూర్తి క్లారిటీ వచ్చేసినట్లయింది.


నవంబర్ 19న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో నిర్వహించిన ఈ ప్రీ-రిలీజ్ వేడుకలో గీతా భాస్కర్ మాట్లాడుతూ.. భావోద్వేగానికి లోనయ్యారు. గత రెండేళ్లుగా తరుణ్ భాస్కర్ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఒడిదుడుకులు (అప్స్ అండ్ డౌన్స్) ఎదుర్కొన్నాడని ఆమె తెలిపారు. కోర్టు కేసులు, ఇల్లు కట్టే పనుల ఒత్తిడి వల్ల చాలా ఇబ్బందులు పడ్డాడని, కొన్నిసార్లు ఇంటికి కూడా రాలేని పరిస్థితులు ఉండేవని, ఒకవేళ వచ్చినా అర్ధరాత్రి 2 లేదా 4 గంటల సమయంలో ఇంటికి వచ్చేవాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, అలాంటి అత్యంత క్లిష్ట సమయాల్లో తరుణ్‌కు అండగా నిలిచిన ఒకే ఒక్క వ్యక్తి ఈషా రెబ్బా అని గీతా భాస్కర్ బహిరంగంగా వెల్లడించారు.


‘‘తరుణ్‌కు ఒక మంచి ఫ్రెండ్‌గా, సపోర్ట్‌గా, ఫ్యామిలీలా, అన్నింటికీ మించి ఒక సోల్‌మేట్‌లా ఈషా అండగా నిలిచింది. నాకు వయసు పైబడుతోంది.. స్నేహితులతో కూడా అన్నీ చెప్పుకోలేము, కానీ జీవితంలో ఒక భాగస్వామి, ఒక సోల్‌మేట్ ఖచ్చితంగా ఉండాలి. ఈషా తన పక్కన ఉందనే విషయం నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తోంది. ‘ఈ నగరానికి ఏమైంది రీపీట్’ సినిమా చేయడం అంత సులభం కాదు.. ఈ ప్రయాణంలో తరుణ్‌కు అద్భుతమైన సపోర్ట్‌గా నిలిచినందుకు ఈషాకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్’’ అంటూ గీతా భాస్కర్ పేర్కొన్నారు. ఒక పబ్లిక్ ఈవెంట్‌లో ఈషా రెబ్బాను తన మదర్.. ‘సోల్‌మేట్’, ‘పార్ట్‌నర్’ అని సంబోధించడంతో తరుణ్ భాస్కర్ సిగ్గుపడుతూ నవ్వడం, ఆడిటోరియమంతా చప్పట్లతో మార్మోగడం విశేషం. మరి ఇంత క్లారిటీ వచ్చిన తర్వాత కూడా.. తరుణ్, ఈషాల బంధంపై అనుమానాలెందుకు? అనేలా అప్పుడే కామెంట్స్ కూడా మొదలయ్యాయి. త్వరలోనే వారిద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టే అవకాశముంది.. చూద్దాం మరి ఎప్పుడు అధికారిక ప్రకటనను విడుదల చేస్తారో..

ఇవి కూడా చదవండి:

‘ది ఏజ్ ఆఫ్ భారత్’ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ మరో అడుగు

‘కింగ్100’ సినిమాపై ఇంత సైలెన్స్ ఎందుకు?

మలేషియాలో గ్రాండ్‌గా మృణాళిని వివాహం.. పెళ్లి ఫోటోలు వైరల్

Updated Date - Nov 18 , 2026 | 03:31 PM

Tharun Bhascker: 'ఓం శాంతి శాంతి శాంతిః' హార్ట్ టచ్చింగ్ థీమ్ సాంగ్ రిలీజ్

Tharun Bhascker: ఈషా రెబ్బతో పెళ్లి.. తరుణ్ భాస్కర్ ఏమన్నాడంటే

Tharun Bhascker: తరుణ్ భాస్కర్ కొత్త సినిమా, ఈషా రెబ్బా కథానాయిక

Tharun Bhaskar: ఈఎన్ఈ రిపీట్ లో బాలకృష్ణ గెస్ట్ అప్పీయరెన్స్

Eesha Rebba:పెళ్లయిన డైరెక్టర్ తో ప్రేమ.. అవసరమా ఈషా