‘రామాయణ’కు తక్కువ ఫుట్‌ఫాల్స్.. భారీ కలెక్షన్స్.. ఎలా సాధ్యమైంది?

ABN , Publish Date - Nov 18 , 2026 | 04:41 PM

రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా, యశ్ రావణుడిగా నటించిన ‘రామాయణ- పార్ట్ 1’ మూవీ రిలీజైనప్పటి నుంచీ పలు విమర్శలను ఎదుర్కొంటూనే ఉంది. తాజాగా ఈ మూవీ ఫుట్‌పాల్స్, కలెక్షన్స్‌పై పెద్ద రచ్చే జరుగుతోంది.

Ramayana Collections Footfalls

రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా, యశ్ రావణుడిగా నటించిన ‘రామాయణ- పార్ట్ 1’ (Ramayana Part 1) మూవీ రిలీజైనప్పటి నుంచీ పలు విమర్శలను ఎదుర్కొంటూనే ఉంది. సినిమా రిలీజ్ అయిన సమయంలో.. ఈ సినిమా ‘రామాయణం’ కాదని ‘రావణాయణం’ అనీ విమర్శకులు విరచుకుపడ్డారు. సీతమ్మతో యాక్షన్ సీన్స్ తెరకెక్కించడాన్నీ తప్పు పట్టారు. అసలు వాల్మీకి రామాయణంలో లేని పలు అంశాలను ఇందులో చొప్పించారనీ పురాణాలను గౌరవించేవారు విమర్శించారు. ఇలా పలు విమర్శలను ఎదుర్కొంటూ కూడా కలెక్షన్స్ పరంగా ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం విశేషం.

ఆ రికార్డులు ఎలా ఉన్నాయంటే.. ఇప్పటి వరకు బీభత్సమైన సినిమాలని చెప్పుకుంటున్న ‘ధురంధర్ 2’, ‘బాహుబలి 2’, ‘పుష్ప 2’ చిత్రాల కలెక్షన్స్‌ను అధిగమించి మరీ ఈ సినిమా 1505.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో టాప్ ప్లేస్‌లో ఉండటంతో.. అంతా ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి ఈ సినిమా మొదటి రోజున ప్రభాస్‌ రాముడిగా నటించిన రామాయణగాథ ‘ఆదిపురుష్’ను కూడా క్రాస్ చేయలేకపోయింది. దీపావళి సెలవుల్లో మాత్రం భారీగా పుంజుకుంది. టాక్ వీక్‌గా ఉన్నా.. కలెక్షన్లపరంగా మాత్రం ఈ సినిమా దూసుకెళుతూనే ఉంది. అందుకు కారణం మాత్రం ‘రామాయణ’లోని వీఎఫ్ఎక్స్ వర్క్ అనే చెప్పుకోవాలి. మరి కలెక్షన్స్ ఆ రేంజ్‌లో ఉన్నా.. ఫుట్‌ఫాల్స్ మాత్రం మరీ దారుణంగా ఉండటంతో.. అసలు ఈ కలెక్షన్స్ ఎలా సాధ్యమయ్యాయి? అంటూ.. సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది.


భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక ఫుట్‌ఫాల్స్ సాధించిన టాప్ 10 చిత్రాల జాబితాను గమనిస్తే.. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ చిత్రం 10.6 కోట్ల ఫుట్‌ఫాల్స్‌తో తిరుగులేని అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ (6.3 కోట్లు), రాకింగ్ స్టార్ యశ్ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ (5 కోట్లు), ‘ఆర్ఆర్ఆర్’ (4.8 కోట్లు) వరుస స్థానాల్లో నిలిచి దక్షిణాది సినిమాల సత్తాను చాటాయి. వీటి తర్వాతి స్థానాల్లో ‘ధురంధర్ 2’ (4.3 కోట్లు) ఐదో స్థానంలో ఉండగా, షారుఖ్ ఖాన్ ‘జవాన్’ (3.9 కోట్లు), ఆమిర్ ఖాన్ ‘దంగల్’ (3.7 కోట్లు), ‘ధురంధర్’ (3.5 కోట్లు), ‘పఠాన్’ (3.4 కోట్లు) వరుసగా 6 నుంచి 9 స్థానాల్లో ఉన్నాయి. పదో స్థానంలో సన్నీ డియోల్ నటించిన ‘గదర్ 2’ చిత్రం 3.3 కోట్ల ఫుట్‌ఫాల్స్‌తో నిలిచింది. ఇప్పుడు కేవలం 13 రోజుల్లోనే 3.26 కోట్ల ఫుట్‌ఫాల్స్ సాధించిన ‘రామాయణ’, పదో స్థానంలో ఉన్న ‘గదర్ 2’ (3.3 కోట్లు) రికార్డును అధిగమించడానికి ఇంకా 4 లక్షల ఫుట్‌ఫాల్స్ దూరంలో ఉంది. అయినా కూడా కలెక్షన్స్ పరంగా ‘ధురంధర్ 2’ (రూ. 1435 కోట్లు), ‘పుష్ప 2’ (రూ. 1370 కోట్లు), ‘బాహుబలి 2’ (రూ. 1260 కోట్లు)లను అధిగమించి.. రూ. 1505.75 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టిందంటే.. ఈ నెంబర్స్, కలెక్షన్స్ స్టంట్ వెనుక ఏమైనా మతలబు జరుగుతుందా? అనేలా టాక్ మొదలైంది.


అయితే, చిత్రయూనిట్ మాత్రం మరోలా సమాధానం ఇస్తుంది. ఇప్పటి వరకు ఫుట్‌ఫాల్స్ అధికంగా ఉన్న సినిమాలన్నీ నార్మల్ థియేటర్స్‌లో కలెక్షన్స్ రాబట్టాయి. కానీ, మా సినిమా ‘రామాయణ’ 3డీ, ఐమ్యాక్స్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ చిత్రం కావడంతో.. మల్టీప్లెక్స్, ప్రీమియం ఫార్మాట్లలో టికెట్ రేట్స్ అధికంగా ఉన్నా.. ప్రేక్షకులు చూస్తున్నారని, అందుకే ఆ స్థాయిలో కలెక్షన్స్ సాధ్యమయ్యాయని వాదిస్తున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏంటో తెలియదు కానీ, మొత్తానికి ‘రామాయణ’ కలెక్షన్స్‌పరంగా మాత్రం సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసిందనే చెప్పుకోవాలి. చూద్దాం మరి.. ముందు ముందు ఇంకా ఎన్ని రికార్డులు ఈ సినిమా క్రియేట్ చేస్తుందో..

ఇవి కూడా చదవండి:

ఈషా రెబ్బాతో తరుణ్ భాస్కర్ బంధంపై గీతా భాస్కర్ క్లారిటీ.. అదీ విషయం

‘ది ఏజ్ ఆఫ్ భారత్’ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ మరో అడుగు

‘కింగ్100’ సినిమాపై ఇంత సైలెన్స్ ఎందుకు?

Updated Date - Nov 18 , 2026 | 04:41 PM

Ramayana Movie: యశ్‌ను అలా చూస్తే చాలు.. డైలాగ్ కూడా అవసరం లేదు.. రకుల్ కామెంట్స్

Ramayana Box Office: అనుమానాలతో మొదలై.. రూ.1400 కోట్లతో 'రామాయణం' సంచలనం

Ramayana Telugu Trailer: రామాయ‌ణ.. ట్రైల‌ర్ అదిరింది

Ramayana: 'రామాయణ' నుంచి మరో సాంగ్ వచ్చేసింది ..

Ramayana: 'రామాయణ్‌’పై ట్రోలింగ్‌ సద్గురు స్పందన..