‘పెద్ది’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఉపాసన.. రామ్ చరణ్ ఎక్కడ?
ABN , Publish Date - Jun 05 , 2026 | 01:17 AM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయంతో దూసుకుపోతోంది. ఈ సక్సెస్‌ను రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఎంజాయ్ చేస్తోంది. ఫ్యాన్స్‌తో కలిసి ఆమె ‘పెద్ది’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ (Peddi Movie) బాక్సాఫీస్ వద్ద భారీ విజయంతో దూసుకుపోతోంది. ఈ సక్సెస్‌ను చిత్రబృందం ఎలా ఎంజాయ్ చేస్తోందో తెలియదు కానీ, చిత్ర హీరో సతీమణి ఉపాసన (Upasana) మాత్రం వార్తల్లో బాగా హైలెట్ అవుతోంది. ఎందుకంటే, ఎప్పుడూ లేని విధంగా రామ్ చరణ్ వైఫ్ కొణిదెల ఉపాసన ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో నేరుగా పాల్గొని సందడి చేశారు. ‘పెద్ది బ్లాక్‌బస్టర్’ అని ఉన్న ఒక భారీ కేక్‌ను ఆమె స్వయంగా కట్ చేసి, అక్కడున్న ఫ్యాన్స్, చిన్న పిల్లలకు తినిపించారు. దీంతో సెలబ్రేషన్స్‌లో సరికొత్త జోష్ కనిపించింది. అయితే ఈ వేడుకల్లో చరణ్ ఎక్కడా కనిపించకపోవడంతో, ఆయన స్థానాన్ని ఉపాసన భర్తీ చేస్తూ ముందుండి నడిపించడం విశేషం.
ఈ వేడుకల్లో మరో ప్రధాన హైలైట్ ఏంటంటే.. ఉపాసనకు వచ్చిన లేడీ ఫ్యాన్స్ అందరూ ఘన స్వాగతం పలికారు. సినిమాకు వస్తున్న భారీ రెస్పాన్స్ చూసి మురిసిపోతూ.. ఉపాసన అండ్ టీమ్‌కు ఎలాంటి దిష్టి తగలకుండా గుమ్మడికాయలతో సాంప్రదాయబద్ధంగా దిష్టి తీశారు. వెలిగించిన కర్పూర గుమ్మడికాయలతో మహిళా అభిమానులు దిష్టి తీస్తున్నంత సేపు ఉపాసన ఎంతో ఓపికగా నిలబడి, వారి ప్రేమకు చేతులెత్తి నమస్కరించారు. ప్రస్తుతం ఈ దిష్టి తీసే విజువల్స్, కేక్ కటింగ్ పిక్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
నిజానికి ‘పెద్ది’ సినిమా చూస్తూ థియేటర్‌లో మాస్ ఆడియన్స్‌లా మారిపోయి ఆమె చేసిన హంగామా నెట్టింట ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. థియేటర్ లోపల చరణ్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తుంటే.. సాధారణ అభిమానిలా కాగితాలు గాల్లోకి ఎగరేస్తూ, ఈలలు వేస్తూ ఉపాసన ఫుల్ గా ఎంజాయ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న విషయం తెలియంది కాదు. థియేటర్‌లో అంతలా పేపర్లు ఎగరేసి రచ్చ చేసిన ఉపాసన.. ఇప్పుడు నేరుగా ఫ్యాన్స్ నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్ లోకి దిగి కేక్ కట్ చేయడం చూస్తుంటే ‘పెద్ది’ విజయం మెగా కుటుంబంలో ఎంతటి ఆనందాన్ని నింపిందో స్పష్టమవుతోంది.
ఇవి కూడా చదవండి:
పవన్ కళ్యాణ్‌ని ‘దొర’ అంటావా.. ప్రకాశ్ రాజ్‌కి ఇచ్చిపడేసిన హేమ!
మీరు నిజంగానే పోరాడారు.. ‘పెద్ది’పై పవన్ కళ్యాణ్ బ్యానర్ పోస్ట్!
‘డ్రాగన్’లోని ఆ సంచనాల కోసం వెయిటింగ్ -ఎన్టీఆర్
త్రిషకు మెగా కోడలు ఉపాసన స్పెషల్ సర్‌ప్రైజ్