‘టైసన్ నాయుడు’ నుంచి మాస్ ఫోక్ సాంగ్.. ఎప్పుడంటే
ABN , Publish Date - Nov 04 , 2026 | 03:54 PM
యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న సరికొత్త యాక్షన్ ఎంటర్టైనర్ ‘టైసన్ నాయుడు’. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది.
యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Sai Sreenivas Bellamkonda) హీరోగా నటిస్తోన్న సరికొత్త యాక్షన్ ఎంటర్టైనర్ ‘టైసన్ నాయుడు’ (Tyson Naidu). ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘భీమ్లా నాయక్’ వంటి విలక్షణమైన హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సాగర్ కె చంద్ర (Saagar K Chandra) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొన్నాళ్లుగా ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో.. సినిమా ఆగిపోయిందనేలా అంతా అనుకుంటున్నారు. కానీ అలాంటిదేమీ లేదనేలా తాజాగా ఓ అప్డేట్తో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘14 రీల్స్ ప్లస్’ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట అత్యంత భారీ బడ్జెట్‌తో, రాజీ పడని నిర్మాణ విలువలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్లు, హై-వోల్టేజ్ టైటిల్ గ్లింప్స్‌కు సినీ ప్రియుల నుంచి, ముఖ్యంగా మాస్ ఆడియన్స్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్‌ను వచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మేకర్స్ అట్టహాసంగా ప్రారంభించారు. ఈ క్రమంలో చిత్ర బృందం ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ సినిమాలోని మొదటి పాట ‘మదరాసి రబ్బరు బొమ్మ’ను నవంబర్ 6న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇదొక పక్కా మాస్ ఫోక్ నంబర్‌గా సాగనుందని సమాచారం. తాజాగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్లో హీరో, హీరోయిన్ సంప్రదాయ జానపద ఆహార్యంలో కలర్‌ఫుల్ బ్యాక్‌డ్రాప్‌లో ఎంతో ఎనర్జిటిక్‌గా కనిపిస్తూ, పాటపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశారు.
ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను మునుపెన్నడూ చూడని ఒక వినూత్నమైన, పవర్ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ క్యారెక్టర్లో దర్శకుడు సాగర్ కె చంద్ర ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి టాలీవుడ్ టాప్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. మాస్ పాటలకు పెట్టింది పేరైన సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండటంతో, ఈ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ పాట థియేటర్లలో ప్రేక్షకులను స్టెప్పులేయించడం ఖాయమనిపిస్తోంది. ముఖేష్ జ్ఞానేష్, అనిత్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ కోసం స్టన్ శివ, విజయ్, వెంకట్, రియల్ సతీష్ వంటి ప్రముఖ ఫైట్ మాస్టర్లు పనిచేస్తున్నారు. నవంబర్ 6న రాబోతున్న ఈ ఫోక్ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
నేరాలకు సినిమాలను బలిపశువును చేస్తారా?: సందీప్ రెడ్డి వంగా ఫైర్
సినిమా రెడీ... టైటిల్ మారాల్సిందే
దియా మీర్జా దీపావళి వీడియోపై రగడ.. బీఎంసీకి బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు