Saagar K Chandra: ‘భీమ్లా నాయక్’ దర్శకుడి తదుపరి హీరో ఎవరంటే?

ABN , First Publish Date - 2023-03-30T18:25:55+05:30 IST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ (Power Star Pawan Kalyan)తో ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు సాగర్ కె చంద్ర (Saagar K Chandra).. తదుపరి సినిమా విషయంలో

Saagar K Chandra: ‘భీమ్లా నాయక్’ దర్శకుడి తదుపరి హీరో ఎవరంటే?
Bheemla Nayak Movie Still

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ (Power Star Pawan Kalyan)తో ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు సాగర్ కె చంద్ర (Saagar K Chandra).. తదుపరి సినిమా విషయంలో అనేక రకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఆ సినిమా వచ్చి చాలా కాలం అవుతున్నా.. ఇంత వరకు అతను ప్రాజెక్ట్ ప్రకటించలేదు. దీంతో అంతా ఆయన చేయబోయే తదుపరి సినిమా ఏమై ఉంటుందా? అని అనుకుంటున్నారు. తాజాగా ఆయన తదుపరి సినిమాకు సంబంధించిన సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని సాగర్ కె చంద్ర తదుపరి చిత్ర ప్రకటనను మేకర్స్ విడుదల చేశారు.

‘భీమ్లా నాయక్’ దర్శకుడి తదుపరి హీరో ఎవరో కాదు ప్రామిసింగ్ యంగ్ హీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas). #BSS10‌గా తెరకెక్కనున్న ఈ మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 14 రీల్స్ ప్లస్ (14 Reels Plus) బ్యానర్‌లో, భారీ బడ్జెట్‌తో నిర్మాతలు రామ్ ఆచంట (Ram Achanta), గోపి ఆచంట (Gopi Achanta) నిర్మించనున్నారు. తాజాగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. సినిమాపై క్యురియాసిటీని జనరేట్ చేస్తుంది. ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించనున్న ఈ చిత్ర ఇతర వివరాలను త్వరలోనే మేకర్స్ ప్రకటిస్తామని తెలిపారు.

BSS10.jpg

హీరో సాయి శ్రీనివాస్ బెల్లంకొండ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన డిఫరెంట్ జోన్‌లో వున్నారు. వైవిధ్యమైన థీమ్‌లతో మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌లతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మాస్ హీరోగా ఎదిగిన శ్రీనివాస్ బెల్లంకొండ ‘ఛత్రపతి’ (Chatrapathi)తో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టబోతున్నారు. సంచలన దర్శకుడు వి.వి. వినాయక్ (VV Vinayak) దర్శకత్వంలో ఆయన హీరోగా తెరకెక్కుతోన్న ‘ఛత్రపతి’ టీజర్‌ (Chatrapathi Teaser)‌ను తాజాగా విడుదల చేశారు. ఆ టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంటోంది. కాగా.. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ వంటి యూనిక్ స్క్రిప్ట్స్‌తో కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ తీయడంలో పేరు తెచ్చుకున్న దర్శకుడు సాగర్ చంద్ర, ఈ బెల్లంకొండ హీరో కోసం విన్నింగ్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

*********************************

*Poonam Kaur: ఫైట్ చేయగలను.. డ్యాన్స్ చేయగలనంటూ ఏ పాటకు డ్యాన్స్ చేసిందంటే..

*Sarath Babu: హాస్పిటల్‌లో నటుడు శరత్ బాబు.. అసలేమైంది?

*Manchu Lakshmi: ‘ఛమ్కీల అంగీలేసి’ పాటకి మంచు లక్ష్మీ స్టెప్స్.. అరిపించేసింది

*Rocking Rakesh: జోర్దార్ సుజాత టార్చర్ పెట్టిందా? ఏడుస్తూ.. అసలు విషయం చెప్పేసిన రాకేష్!

*Tollywood: శోభితతో చైతూ.. సుప్రియతో శేష్.. ఇలా దొరికేశారేంటి?

Updated Date - 2023-03-30T18:25:56+05:30 IST