Tyson Naidu: రాజస్థాన్‌లో ‘టైసన్ నాయుడు’ కీలక షెడ్యూల్

ABN , Publish Date - May 24 , 2024 | 06:17 PM

ప్రామెసింగ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా.. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘టైసన్ నాయుడు’. 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తోన్న ఈ చిత్రం నుంచి ఆ మధ్య బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా రివీల్ చేసిన టైటిల్ గ్లింప్స్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి రాజస్థాన్‌లో కీలక షెడ్యూల్ ప్రారంభమైనట్లుగా మేకర్స్ తెలిపారు.

Tyson Naidu: రాజస్థాన్‌లో ‘టైసన్ నాయుడు’ కీలక షెడ్యూల్

ప్రామెసింగ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) హీరోగా.. సాగర్ కె చంద్ర (Saagar K Chandra) దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘టైసన్ నాయుడు’ (Tyson Naidu). 14 రీల్స్ ప్లస్ (14 Reels Plus) నిర్మిస్తోన్న ఈ చిత్రం నుంచి ఆ మధ్య బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా రివీల్ చేసిన టైటిల్ గ్లింప్స్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక అప్డేట్‌ని మేకర్స్ ఇచ్చారు.

*Bengaluru Rave Party: పేరు మార్చిన హేమ, అసలు పేరేంటో తెలిస్తే షాకవుతారు!

ఈ సినిమాకు కీలకమైన 2 వారాల షెడ్యూల్‌ను రాజస్థాన్‌ (Rajasthan)లో ప్రారంభించినట్లుగా మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. స్టన్ శివ పర్యవేక్షణలో రాజస్థాన్ కోటలలో పది రాత్రులు సినిమాకు సంబంధించిన బ్రెత్ టేకింగ్ యాక్షన్ బ్లాక్‌ను టీమ్ షూట్ చేస్తోంది. ఇది సినిమాలో మెయిన్ హైలైట్‌లలో ఒకటని.. ఈ 2 వారాల లెన్తీ షెడ్యూల్‌లో కొంత టాకీ పార్ట్ కూడా షూట్ చేయనున్నామని మేకర్స్ తెలిపారు. ఈ సబ్జెక్ట్‌పై టీమ్ సూపర్ కాన్ఫిడెంట్‌గా ఉండటంతో రాజీపడకుండా సినిమాను రూపొందిస్తున్నామని నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట పేర్కొన్నారు. ఈ అప్డేట్‌‌తో పాటు ఓ పవర్ ఫుల్ పిక్‌ని కూడా మేకర్స్ వదిలారు. (Tyson Naidu Crucial 2-week Schedule Begins In Rajasthan)


Bellamkonda-Sai-Srinivas.jpg

ఈ పిక్‌లో గ్లింప్స్‌లో చూపిన విధంగా, బెల్లంకొండ సినిమాలో మాస్ లుక్‌లో ఉన్నారు. పోలీస్‌గా మునుపెన్నడూ చూడని యాక్షన్ ప్యాక్ క్యారెక్టర్‌లో బెల్లంకొండను ప్రెజెంట్ చేస్తున్నారు సాగర్ కె చంద్ర. టాప్ టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేస్తున్నారు. ముఖేష్ జ్ఞానేష్ మరియు అనిత్ డీవోపీ వ్యవహరిస్తుండగా, సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) సంగీతాన్ని అందిస్తున్నారు. మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.

Read Latest Cinema News

Updated Date - May 24 , 2024 | 06:17 PM