ఘనంగా తేజ సజ్జా, మౌర్యల నిశ్చితార్థం.. తళుక్కుమన్న స్టార్స్

ABN , Publish Date - Nov 16 , 2026 | 05:27 PM

పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ ‘హను-మాన్’ చిత్రంతో దేశవ్యాప్తంగా ‘సూపర్ హీరో’గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు

Teja Sajja and Mourya Engagement

పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ ‘హను-మాన్’ (Hanu Man) చిత్రంతో దేశవ్యాప్తంగా ‘సూపర్ హీరో’గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా (Teja Sajja) తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సోమవారం (నవంబర్ 16) హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ప్రముఖ హోటల్ తాజ్ కృష్ణాలో మౌర్య (Mourya) అనే యువతితో తేజ సజ్జా నిశ్చితార్థ వేడుక (Teja Sajja Engagement) అత్యంత వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఈ నిశ్చితార్థ వేడుకలో లేత గులాబీ రంగు ఫ్లోరల్ జాకెట్‌తో కూడిన సంప్రదాయ కుర్తాలో తేజ సజ్జా, ఆకుపచ్చ రంగు డిజైనర్ లెహంగాలో అతని ఫియాన్సీ మౌర్య ఎంతో అందంగా మెరిసిపోతూ ఉంగరాలు మార్చుకున్నారు. ఈ నిశ్చితార్థ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించడంతో వేడుకంతా తారాతోరణంలా మారింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రత్యేకంగా హాజరై తేజ సజ్జా, మౌర్యలకు శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు, రాజకీయ నాయకులు హాజరై కాబోయే నూతన జంటను ఆశీర్వదించారు.


Telangana-Governer.jpg

టాలీవుడ్ నుంచి అగ్ర నిర్మాతలు, స్టార్ హీరోలు, ప్రముఖ దర్శకులు కూడా ఈ వేడుకలో సందడి చేయడంతో తాజ్ కృష్ణా ప్రాంగణమంతా కోలాహలంగా కనిపించింది. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి, హీరోగా మారి ‘జాంబీ రెడ్డి’, ‘హను-మాన్’, ‘మిరాయ్’ వంటి విజయాలతో దూసుకుపోతున్న తేజ సజ్జా.. ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండటంతో అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. డిసెంబర్‌లో వీరి వివాహం కూడా అత్యంత వైభవంగా జరగనున్నట్లు తెలుస్తోంది. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న తేజ సజ్జా - మౌర్య జంటకు ప్రస్తుతం అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

ఇళయదళపతి విజయ్ బయోపిక్.. హీరో, దర్శకుడు ఫిక్స్ అయినట్టేనా?

‘రామాయణం’ చూసి ఫిదా అయిన అమల!

తనిష్క్ దోపిడీ.. అరెస్టు తర్వాత పెరిగిన యూట్యూబర్ మీనాక్షి ఫాలోవర్స్

Updated Date - Nov 16 , 2026 | 05:33 PM

Teja Sajja: ఈసారి సూపర్ యోధుడుగా.. లుక్ అదిరింది

Teja Sajja: ఈ జనరేష‌న్‌లో.. 100 రోజులు నీకే సొంతం అని మెసేజ్ చేశారు

Teja Sajja: అన్నీ కష్టాలే.. ఓ పెద్ద వ్యక్తే నమ్మించి మోసం చేశాడు..

Teja Sajja - Prasanth Varma: మనకి ఏం కావాలన్నా మనమే అడిగి తీసుకోవాలి..

Teja Sajja: చిరంజీవిపై ప్రేమ‌.. ఆ వేదిక‌పై హ‌నుమాన్ ‘తేజ’ డ్యాన్స్ పెర్ఫామెన్స్