Teja Sajja: ఈసారి సూపర్ యోధుడుగా.. లుక్ అదిరింది

ABN , Publish Date - Apr 16 , 2024 | 08:45 PM

‘హను మాన్’ సినిమాలో సూపర్ హీరోగా కనిపించిన యంగ్ హీరో తేజ సజ్జా.. ఈసారి సూపర్ యోధుడుగా కనిపించబోతున్నారు. ‘హను మాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న తేజ సజ్జా.. మరోసారి అదే తరహా గ్రాండియర్ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ‌పై కార్తీక్ ఘట్టంనేని దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించనున్నారు.

Teja Sajja: ఈసారి సూపర్ యోధుడుగా.. లుక్ అదిరింది
Hero Teja Sajja

‘హను మాన్’ (Hanu Man) సినిమాలో సూపర్ హీరోగా కనిపించిన యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja).. ఈసారి సూపర్ యోధుడుగా కనిపించబోతున్నారు. ‘హను మాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న తేజ సజ్జా.. మరోసారి అదే తరహా గ్రాండియర్ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టంనేని (Karthik Gattamneni) దర్శకత్వంలో తెరకెక్కనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) ప్రొడక్షన్ నంబర్ 36గా నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad) నిర్మించనున్న ఈ పాన్ ఇండియా మూవీని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

*Shraddha Das: కాస్త గ్యాప్ తర్వాత.. నేను కూడా ట్రై చేశా!


ఈ పోస్టర్‌లో సూపర్ హీరో తేజ సజ్జ తన ముఖంలో ఇంటెన్సిటీ‌తో బ్యాక్ పోజ్‌లో హుందా‌గా కనిపిస్తున్నారు. ‘హనుమాన్’ చిత్రంలో సాంప్రదాయ దుస్తులలో కనిపించి మ్యాజిక్ చేసిన తేజ, ఈ సినిమాలో మాత్రం స్టైలిష్ మేకోవర్‌తో సూపర్ యోధాగా (Super Yodha) కనిపించనున్నాడనేది ఈ పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. అలాగే ఈ పోస్టర్‌లో తన దుస్తులపై మంటలను కూడా గమనించవచ్చు. భారీ స్థాయిలో, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్‌ని ఏప్రిల్ 18న మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.


Teja-sajja.jpg

‘ఈగల్’ (Eagle) తర్వాత కార్తీక్ ఘట్టంనేని మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ‌కు ఇది వరుసగా రెండవ ప్రాజెక్ట్. తేజ సజ్జ కోసం లార్జర్ దాన్ లైఫ్ స్టోరీని రెడీ చేశాడని, ఇది సూపర్ యోధ యొక్క సాహసోపేతమైన కథ అని.. హై టెక్నికల్ మరియు ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌లో నిర్మించే ఈ చిత్రానికి గొప్ప సాంకేతిక నిపుణులు పని చేయనున్నారని మేకర్స్ చెబుతున్నారు. ఏప్రిల్ 18న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

Updated Date - Apr 16 , 2024 | 08:45 PM