సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నిన్న జగమే సంగీతం... నేడు డి.ఎన్.కె.: సుస్మితా శెట్టి

ABN, Publish Date - Nov 04 , 2026 | 05:20 PM

'జగమే సంగీతం' వెబ్ సిరీస్‌తో నటిగా పరిచయమైన సుస్మిత శెట్టి.. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న 'డి.ఎన్.కె.' సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. నవంబర్ 13న సినిమా విడుదల కానుంది.

DNK Movie Heroine Sushmitha Shetty

మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న చిత్రాలను కూడా ప్రోత్సహిస్తోంది. ఈ బ్యానర్‌పై రూపొందుతున్న క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘డి.ఎన్.కె.’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నవంబర్ 13న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సుస్మితా శెట్టి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

మీ నేపథ్యం.. సినిమాల్లోకి రావాలనే ఆసక్తి ఎలా కలిగింది?

- నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. కాకపోతే మా గ్రాండ్ పేరెంట్స్ కన్నడ నుంచి 40 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చారు. నాకు శ్రీదేవి గారు స్ఫూర్తి. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. అన్ని రకాల డ్యాన్స్‌లు నేర్చుకున్నాను. డ్యాన్స్ చేసేటప్పుడు చాలా ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా నాకు నటనపై ఆసక్తి ఏర్పడింది. నేను ఫారిన్‌లో చదువుకున్నాను. అక్కడ చదువుకునేటప్పుడు థియేటర్ కూడా చేశాను. లీడ్ హీరోయిన్‌గా ‘డి.ఎన్.కె.' (దొంగ నా కొడుకు) నా మొదటి సినిమా. ఇంతకుముందు ‘జగమే సంగీతం’ అనే వెబ్ సిరీస్ చేశాను. ఒక నటిగా బిగ్ స్క్రీన్ పై చూసుకోవడానికి చాలా ఎక్సయిటెడ్ గా ఉన్నాను.

ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

- ఇందులో చాలా క్యూట్ అండ్ బబ్లీ క్యారెక్టర్ చేశాను. కొంచెం తింగరి క్యారెక్టర్. కథానాయకుడు ఈశ్వర్‌ను చాలా ప్రేమిస్తుంది. తన ప్రేమ కోసం ఏదైనా చేస్తుంది. తను చాలా స్మార్ట్ అనుకునే క్యారెక్టర్. ఇందులో క్రైమ్‌లో తెలియకుండానే ఇన్నోసెంట్‌గా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. ఇందులో నా క్యారెక్టర్ ఇన్నోసెంట్‌ కామెడీ ఉంటుంది. నేను ఏదైనా స్మార్ట్‌గా చేయాలనుకుంటే అది కామెడీగా మారుతుంది.


మైత్రీ మూవీ మేకర్స్‌లో పని చేయడం ఎలా అనిపించింది?

- మైత్రీ మూవీ మేకర్స్‌లో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. వెరీ బిగ్ ప్రొడక్షన్ హౌస్. పెద్ద స్టార్ సినిమాలతో పాటు మంచి కంటెంట్ ఉన్న కథలకు కూడా వాళ్లు సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది.

మౌళితో వర్క్ చేయడం గురించి?

-మౌళి చాలా టాలెంటెడ్. చాలా హంబుల్‌గా ఉంటారు. తనతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. తనకి మరిన్ని మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను.

టాలీవుడ్‌లో మీకు ఇష్టమైన డ్యాన్సింగ్ హీరోలు ఎవరు?

రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు.

మ్యూజిక్ గురించి?

-సింజిత్ చాలా టాలెంటెడ్ మ్యూజిషియన్. ఇది క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్. దీనికి తగ్గట్టుగా చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.

డైరెక్టర్ గురించి?

- డైరెక్టర్ గారు చాలా రిలాక్స్‌డ్‌గా ఉంటారు. ఇది ఆయన తొలి సినిమా. అయినా ఆయన ముఖంలో ఎప్పుడూ టెన్షన్ కనిపించదు. చాలా కూల్‌గా ఉంటారు.


ఈ సినిమా ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది?

- సినిమా చూసి ప్రేక్షకులు నవ్వుకుంటూ వస్తారు. ఇందులో చాలా ఎంటర్‌టైనింగ్ కామెడీ ఉంటుంది. చాలా ఫ్రెష్ కామెడీ ఉంది.

మీ డ్రీమ్ రోల్ ఏమిటి?

నాకు ‘మహానటి’ సినిమా చాలా ఫేవరెట్. అందులో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. నాకు కూడా అలాంటి అన్ని ఎమోషన్స్ ఉన్న ఒక సినిమా చేయాలని ఉంది. అలాగే స్పోర్ట్స్ సినిమాలు కూడా చేయాలని ఉంది. నాకు రొమాంటిక్ కామెడీలు అంటే చాలా ఇష్టం. అలాగే హారర్, సస్పెన్స్ థ్రిల్లర్స్‌ను కూడా ఇష్టపడతాను.

ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి?

- తమిళంలో రెండు ప్రాజెక్టులు చేస్తున్నాను.

ఇవి కూడా చదవండి:

నేరాలకు సినిమాలను బలిపశువును చేస్తారా?: సందీప్ రెడ్డి వంగా ఫైర్

సినిమా రెడీ... టైటిల్ మారాల్సిందే

దియా మీర్జా దీపావళి వీడియోపై రగడ.. బీఎంసీకి బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు

Updated Date - Nov 04 , 2026 | 05:25 PM