ఒకే రోజు మెగా నిర్మాతల సినిమాల పోటీ.. 'ఇడుపు కాగితం'తో 'పాకెట్ రాకెట్స్' ఢీ!

ABN , Publish Date - Nov 04 , 2026 | 01:13 PM

డిసెంబర్ 11న ప్రియదర్శి నటించిన 'ఇడుపు కాగితం', నిహారిక కొణిదెల నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న 'పాకెట్ రాకెట్స్' విడుదల కానున్నాయి. మెగా కుటుంబానికి అనుబంధంగా ఉన్న నిర్మాతల సినిమాలు ఒకే రోజు పోటీ పడనున్నాయి.

Niharika Vs Bunny Vasu

మెగా హీరోలు ఒక్కోసారి ఒకరితో ఒకరు పోటీ పడుతుండటం జరుగుతుంటుంది. ఎక్కువ మంది హీరోలు ఒకే కుటుంబం నుంచి వస్తుండటంతో అది అనివార్యంగా మారుతోంది. వచ్చే సంక్రాంతికి కూడా మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'కాకా' లేదా 'విశ్వంభర' చిత్రాలు వస్తాయని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే అదే సీజన్‌ లో చిరంజీవి మేనల్లుడు సాయి దుర్గా తేజ్‌ నటించిన 'సంబరాల యేటి గట్టు'ను జనవరి 12న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇదిలా ఉంటే... ఇప్పుడు మెగా ఫ్యామిలీ, వారి అనుబంధ కుటుంబాల నిర్మాతల మధ్య కూడా పోటీ వాతావరణం ఏర్పడింది.


ప్రియదర్శి, నాగదుర్గ జంటగా సుకుమార్‌, బన్నీ వాసు కలిసి 'ఇడుపు కాగితం' అనే సినిమాను నిర్మిస్తున్నారు. వంశీ రెడ్డి దొండపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని డిసెంబర్ 11న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ చాలా కాలం క్రితమే ప్రకటించారు. అయితే ఇప్పుడు సరిగ్గా అదే తేదీకి నిహారిక కొణిదెల నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న 'పాకెట్‌ రాకెట్స్ ' మూవీ కూడా రాబోతోంది. నిహారిక కొణిదెల హోమ్ ప్రొడక్షన్‌ హౌస్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థతో కలిసి దీనిని నిర్మిస్తోంది. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి దీనికి నిర్మాతలు. రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో త్రినాథ్ వర్మ, నిర్మల్ హీరోలుగా… శ్రియా కొంతం హీరోయిన్‌గా .. జేడీ చక్రవర్తి ముఖ్యపాత్రలో న‌టిస్తున్నారు. అంటే అటు బన్నీ వాసు, సుకుమార్ భార్య తబిత నిర్మిస్తున్న సినిమా, ఇటు నాగబాబు కూతురు నిహారిక, భార్య పద్మజ కొణిదెల నిర్మిస్తున్న సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ పడబోతున్నాయన్న మాట. బన్నీ వాసు అల్లు అరవింద్‌ క్యాంప్ కు చెందిన నిర్మాత కాగా, నిహారిక మెగా డాటర్‌. సో... మరి వీరిద్దరి నుంచి ఒకే రోజు రాబోతున్న 'ఇడుపు కాగితం', 'పాకెట్‌ రాకెట్స్' చిత్రాలలో ఏది విజయాన్ని దక్కించుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

దియా మీర్జా దీపావళి వీడియోపై రగడ.. బీఎంసీకి బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు

రామాయణ 3.. అంతా వారి చేతుల్లోనే

ఇట్లు అర్జునకి అండగా ఎన్టీఆర్..

Updated Date - Nov 04 , 2026 | 01:47 PM

ఇట్లు అర్జునకి అండగా ఎన్టీఆర్..

రామాయణ 3.. అంతా వారి చేతుల్లోనే

ఓటీటీకి వచ్చేస్తోన్న జైలర్ 2..

ఓమ్.. సాయిపల్లవి అన్ని కోట్లు తీసుకుందా

థమన్ ను పక్కన పెట్టిన త్రివిక్రమ్.. మళ్లీ కలుస్తారా