‘సమ్మర్ హాలిడేస్’తో బాల్యపు జ్ఞాపకాలు.. ఈ నెల 30న విడుదల
ABN , Publish Date - Oct 16 , 2026 | 02:49 PM
ధీరజ్ మొగిలినేని నిర్మించిన ‘సమ్మర్ హాలిడేస్’ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. శ్రీకర్ దర్శకత్వంలో రోహన్ రాయ్, అరుణ్, ఖుషీ తదితరులు నటించిన ఈ చిత్రం చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేయనుంది.
ప్రముఖ పంపిణీదారుడు, నిర్మాత ధీరజ్ మొగిలినేని ఎంతో మనసుపడి నిర్మించిన సినిమా 'సమ్మర్ హాలిడేస్'. నిజానికి ఈ సినిమా మే1న విడుదల కావాల్సింది. అయితే మరింత సమయం తీసుకుని, సరిగా ప్రమోషన్ చేసుకుని తన సినిమాను జనం ముందుకు తీసుకురావాలని ధీరజ్ భావించారు. దాంతో సినిమా రిలీజ్ను వాయిదా వేశారు. ఆ తర్వాత ఈ సినిమాలోని మూడు పాటలను వరుసగా విడుదల చేశారు. అన్నీ వ్యూవర్స్ నుంచి మంచి అప్లాజ్ను అందుకున్నాయి. అందుకే ఇప్పుడీ సినిమాను ఈ నెల 30న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు విజయవాడలో జరుగబోతున్న ఓ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొనబోతోంది.
రోహన్ రాయ్, అరుణ్, ఖుషీ, జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకీ, హర్షిణి, హర్షవర్థన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను శ్రీకర్ తెరకెక్కించారు. కథాబలం ఉన్న సినిమాలు ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతోనే దీనిని తీశానని ధీరజ్ మొగిలినేని చెబుతున్నారు. ప్రతి ఒక్కరి చిన్ననాటి రోజుల్ని గుర్తు చేసేలా 'సమ్మర్ హాలిడేస్' ఉంటుందని దర్శకుడు శ్రీకర్ తెలిపారు. మరి బాలల చిత్రాలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో వస్తున్న 'సమ్మర్ హాలిడేస్'కు ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.
Crazy Kalyanam Review: అనుపమ పరమేశ్వరన్ '‘క్రేజీ కల్యాణం’ ఎలా ఉందంటే..
Aishwarya Lekshmi: లైఫ్ పార్టనర్ ముందు ఎలా ఉండాలంటే..
jailer 2 : రజనీ అభిమానులకు ముందే వచ్చిన దీపావళి