వామ్మో.. 'స్పిరిట్, వారణాసి'లతో 'భారతీయుడు 3' పోటీ?
ABN , Publish Date - Oct 15 , 2026 | 09:29 PM
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాను 2027 మార్చి లేదా ఏప్రిల్‌లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan), దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ మూవీ 'భారతీయుడు 3'. 1996లో వీరిద్దరి కలయికలో వచ్చిన 'భారతీయుడు' సినిమా ఎలాంటి సంచలన విజయం సాధించిందో, ట్రెండ్ సెట్టర్‌గా ఎలా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన స్వతంత్ర సమరయోధుడు సేనాపతి పాత్ర ఒక ఐకానిక్ క్యారెక్టర్‌గా నిలిచిపోయింది. అయితే దాదాపు 28 ఏళ్ల తర్వాత సీక్వెల్‌గా వచ్చిన 'భారతీయుడు 2' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ఇక సెకండ్ పార్ట్ చివర్లో 'ఇండియన్ 3స (Bharateeyudu 3) కూడా ఉందంటూ మేకర్స్ గ్లింప్స్ చూపించినప్పటికీ.. 'ఇండియన్ 2' ఫలితం చూశాక థర్డ్ పార్ట్‌పై అందరూ ఆశలు వదిలేసుకున్నారు. ఈ సినిమా పూర్తిగా ఆగిపోయిందని వార్తలు కూడా గుప్పుమన్నాయి. కానీ, ఇటీవలె మేకర్స్ థర్డ్ పార్ట్‌ను అధికారికంగా ప్రకటించి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. 'భారతీయుడు 2' నిరాశ పరిచినప్పటికీ.. పార్ట్ 3పై మాత్రం అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
అయితే, 'భారతీయుడు 2' నిరాశపరిచినప్పటికీ.. పార్ట్ 3పై మాత్రం అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. 'ఇండియన్ 2' చివరిలో చూపించిన విజువల్సే. ఈ మూడో భాగం పూర్తిగా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో, రగ్గడ్ లొకేషన్లలో, ఒక అచ్చమైన వింటేజ్ లుక్‌లో ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది. అంతేకాదు, స్వాతంత్ర్య సమరయోధుడు సేనాపతి మూలాలు ఏంటి? ఆయన గతం ఏంటి? బ్రిటీష్ కాలంలో సేనాపతి చేసిన వీరోచిత పోరాటాలు ఎలాంటివి? అనే పవర్ఫుల్ ఫ్రీడమ్ ఫైటర్ బ్యాక్‌డ్రాప్‌ను ఈ మూడో భాగంలో చూపించబోతున్నారట. ఈ పాయింటే ఇప్పుడు సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేసింది.
తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. మార్చిలో ప్రభాస్ (Prabhas) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘స్పిరిట్’ (Spirit) విడుదల కానుంది. ఇక దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’ (Varanasi) ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ రెండు సినిమాలపై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి భారీ చిత్రాల మధ్యలోకి ‘భారతీయుడు 3’ ని దింపడం అంటే పెద్ద సాహసమే అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే 'భారతీయుడు 2' రిజల్ట్ నిరాశపరచడంతో.. పార్ట్ 3 సోలోగా వస్తేనే సేఫ్ అని, లేదంటే థియేటర్ల కేటాయింపు, ప్రేక్షకుల ఎంపిక, వసూళ్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
పాన్ ఇండియా సినిమాల విషయంలో విడుదల తేదీతో పాటు, ప్రచార వ్యూహం, ఇతర చిత్రాలతో పోటీ ఎంత కీలకమో తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో ‘భారతీయుడు 3’ మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇతర భారీ చిత్రాలతో పోటీపడి అదే సమయంలో బరిలోకి దిగుతారా? లేక సోలో రిలీజ్ కోసం వేరే సేఫ్ డేట్‌ను ఎంచుకుంటారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.