Ranabaali X Review: ‘రణబాలి’కి మిక్స్‌డ్ టాక్.. విజయ్, రష్మిక కెమిస్ట్రీ సూపర్.. అసలు చిక్కంతా అక్కడే!

ABN , Publish Date - Oct 16 , 2026 | 09:57 AM

విజయ్ దేవరకొండ వరుస సినిమాలు చేస్తున్నా ఏది కలిసిరావడం లేదు. ఈ  మధ్య కాలంలో ఆయన చేసిన ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు ఆయనకు హిట్ చాలా అవసరం

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) వరుస సినిమాలు చేస్తున్నా ఏది కలిసిరావడం లేదు. ఈ  మధ్య కాలంలో ఆయన చేసిన ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు ఆయనకు హిట్ చాలా అవసరం. దానికోసమే కసరత్తులు చేస్తున్నారు. అభిమానుల ఎదురుచూపు కూడా అదే.  ‘శ్యామ్ సింగ రాయ్’తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో  పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ (Ranabaali X review) చేశారు. ఈ సినిమా ప్రకటన నుంచి హైప్ క్రియేట్ అయింది. ట్రైలర్ విడుదల తర్వాత మరింత అంచనాలు పెరిగాయి.  శుక్రవారం ప్రేక్షాకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎక్స్ లో నెటిజన్లు ఏమనుకుంటున్నారో చూద్దాం.  

ఫస్టాఫ్ పర్వాలేదు.. సెకండాఫ్‌తోనే చిక్కు!

‘రణబాలి’ ప్రీమియర్ షోలు చూసిన కొందరు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా తొలి భాగం ఆసక్తికరంగా సాగిందని, ఇంటర్వెల్ వరకు కథనం బాగానే ఉందని అభిప్రాయపడుతున్నారు. అయితే ద్వితీయార్థంలో కథ నెమ్మదించడంతో పాటు కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించాయని చెబుతున్నారు. సెకండాఫ్‌పై దర్శకుడు మరింత శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేదనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

విజయ్ దేవరకొండ నటన ఒకే.. కానీ!

సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేదని భావిస్తున్న కొందరు ప్రేక్షకులు విజయ్ దేవరకొండ నటనను మాత్రం ప్రశంసిస్తున్నారు. తన పాత్ర కోసం ఆయన చేసిన కృషి తెరపై కనిపిస్తోందని అంటున్నారు. అయితే కథనం, స్క్రీన్‌ప్లే విషయంలో లోపాలు ఉండటంతో విజయ్ పడిన శ్రమకు తగిన గుర్తింపు లభించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రష్మికతో సీన్స్ హైలైట్!

‘రణబాలి’లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని కొందరు చెబుతున్నారు. వీరిద్దరి కెమిస్ట్రీతో పాటు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయని పోస్ట్లు పెడుతున్నారు. రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచిందని పేర్కొంటున్నారు. ‘రణబాలి’ ప్రీమియర్ టాక్‌లో విజయ్ నటన, రష్మికతో సన్నివేశాలకు ప్రశంసలు లభిస్తుండగా, సెకండాఫ్ విషయంలో మాత్రం విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చ‌ద‌వండి..

వామ్మో.. స్పిరిట్, వారణాసిల‌తో.. భారతీయుడు 3 పోటీ?

రామ్ చరణ్ - సుకుమార్ సినిమాలో బ్లాస్ట్ బ్యూటీ?

Balakrishna: ఈ సారి.. 'దాదా' టార్గెట్‌ మిస్‌ అవ్వదు!

హాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన వారణాసి.. ఐమాక్స్ ఛానల్‌లో నంబర్ వన్‌గా మహేష్ మూవీ!

విశాఖలో మెగాస్టార్ చిరంజీవి మల్టీప్లెక్స్.. లీక్ చేసిన ఎమ్మెల్యే

Updated Date - Oct 16 , 2026 | 10:26 AM