విగ్గు ఎందుకు వాడుతున్నారు? అంటే.. నరేష్ ఇచ్చిన సమాధానమిదే
ABN , Publish Date - Oct 15 , 2026 | 02:32 PM
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ వీకే ఎప్పుడూ తనదైన స్టైల్, ఎనర్జీతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఒకవైపు విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూనే, మరోవైపు వ్యక్తిగత జీవితంలోనూ ట్రెండీగా కనిపిస్తుంటారు.
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ వీకే (Naresh VK) ఎప్పుడూ తనదైన స్టైల్, ఎనర్జీతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఒకవైపు విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూనే, మరోవైపు వ్యక్తిగత జీవితంలోనూ ట్రెండీగా కనిపిస్తుంటారు. అయితే, ఆయన ఎక్కడికి వెళ్లినా మెయింటైన్ చేసే హెయిర్‌స్టైల్, హెయిర్ విగ్ వెనుక ఉన్న ఆంతర్యమేంటనేది చాలామందికి ఉన్న సందేహం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన హెయిర్ విగ్ (Hair Wig) పై నరేష్ నిజాయతీగా, ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ‘‘ఎన్టీఆర్ (NTR), ఏఎన్నార్ (ANR), ఇప్పుడు రజనీకాంత్ (Rajinikanth) బయటకు వచ్చినప్పుడు విగ్గులు పెట్టుకోరు. సినిమాల్లో మాత్రమే వేషానికి తగినట్లుగా ఉంటారు. మరి మీరు ఇలా కంటిన్యూ అవ్వడానికి కారణం ఏంటి? అనే ప్రశ్న నరేష్‌కు ఎదురైంది.
ఈ ప్రశ్నకు నరేష్ సమాధానమిస్తూ.. ‘‘అప్పట్లో శోభన్‌బాబు గారు ఉండేవారు. ఆయన ఎక్కడికొచ్చినా హెయిర్ సిస్టమ్ పెట్టుకుని, సూట్ వేసుకుని కనిపించేవారు.. అది ఆయన స్టైల్. రామారావు గారు ఆయనలా వచ్చేవారు. ఇక కృష్ణ గారైతే అసలు లెక్కే చేసేవారు కాదు, ఎవరున్నా సరే విగ్గు పీకేసి కూర్చునేవారు. కాబట్టి ఇదంతా పర్సనల్ ప్రిఫరెన్స్. ఒక యాక్టర్ అనేవాడు తన లుక్ గురించి సిగ్గుపడాల్సిన పనిలేదు. నన్ను నేను ఎలా ప్రెజంట్ చేసుకోవాలి, ఎలా కనిపిస్తే బాగుంటుందనేది నా ఇష్టం, నా ఛాయిస్. నేను ఇలా ఉండటానికి ఇష్టపడతాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను’’ అని చెప్పుకొచ్చారు.
ఇంకా పాత్రల కోసం తాను ఎంతటి మార్పుకైనా సిద్ధపడతానని నరేష్ గుర్తుచేశారు. ‘రంగస్థలం’ సినిమాలో ఎలాంటి హెయిర్ సిస్టమ్ లేకుండా, ఉన్న జుట్టును కూడా పూర్తిగా షేవ్ చేయించుకుని బట్టతలతోనే నటించానని చెప్పారు. అలాగే ‘క్రేజీ కళ్యాణం’ సినిమాలోనూ హెయిర్ సిస్టమ్ లేకుండానే చేశానని అన్నారు. ‘‘నాకేం జుట్టు లేకుండా పోలేదు, దువ్వుకునే జుట్టు ఉంది. కానీ ఒక ఆర్టిస్ట్‌గా జనం నన్ను ఎలా చూడాలనుకుంటున్నారు, నేను ఎలా ప్రెజంట్ అవ్వాలనుకుంటున్నాననే దాన్ని బట్టి ఎంత కావాలో అలా హెయిర్ సిస్టమ్‌ను వాడుకుంటాను. రజనీకాంత్ గారు విగ్గు లేకుండా బయట తిరిగినా ఆయన స్టార్డమ్ ఎక్కడికీ పోదు, కానీ తెరపై విగ్గు లేకుండా యాక్ట్ చేయగలరా? కాబట్టి ఎవరి ఇష్టం వారిది’’ అంటూ నరేష్ క్లారిటీ ఇచ్చారు. నరేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
‘జైలర్ 2’ ప్రీ-సేల్స్ విధ్వంసం: టాప్ 10 ఆల్‌టైమ్ లిస్ట్‌లో రజనీ రికార్డ్
విశాఖలో మెగాస్టార్ చిరంజీవి మల్టీప్లెక్స్.. లీక్ చేసిన ఎమ్మెల్యే
బాలీవుడ్‌కు కృతి శెట్టి.. ఫస్ట్ ఫిల్మ్ షూటింగ్ ప్రారంభం