సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

వారితో వాదించే అవసరం నాకెప్పుడూ రాలేదు- సమంత

ABN, Publish Date - May 26 , 2026 | 12:54 AM

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో విడుదల చేశారు.

Maa Inti Bangaaram Trailer Launch

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సమంత (Samantha), రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram). సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నందినీ రెడ్డి (Nandini Reddy) దర్శకురాలు. జూన్ 19న రిలీజ్‌కు సిద్ధమైన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను సోమవారం మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ లాంచ్ వేడుకను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో హీరోయిన్ సమంత మాట్లాడుతూ .. ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ థాంక్స్. నందినీ, రాజ్ ప్రతీ విషయంలో పర్‌ఫెక్ట్‌గా ఉంటారు. ఇంత వరకు నేను వారితో వాదించే విషయం గానీ, అలాంటి ఓ ఘటన గానీ ఎప్పుడూ ఎదురు కాలేదు. అంతా స్మూత్‌గా జరిగిపోతుంది. ఈ సినిమాలో ప్రతీ ఎమోషన్ ఉంటుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. యాక్షన్, డ్రామా, కామెడీ అన్ని అంశాలుంటాయి. జూన్ 19న రాబోతోన్న ఈ చిత్రాన్ని అందరూ చూసి ఎంజాయ్ చేయండి. అభిమానులంతా గర్వపడేలా ఈ సినిమా ఉంటుందని తెలిపారు.


దర్శకురాలు నందినీ రెడ్డి మాట్లాడుతూ .. సమంత దినదినాభివృద్ది చెందుతున్నారు. ఒకప్పటి సమంతకి ఇప్పటి సమంతకు చాలా తేడా ఉంది. ఇప్పుడామె నెక్ట్స్ లెవెల్లో ఉన్నారు. యాక్షన్, కామెడీ, ఎమోషన్ ఇలా ప్రతీ సీన్‌లో సమంత అదరగొట్టేశారు. నేను కూడా సమంత ఫ్యాన్‌గానే మానిటర్ ముందు కూర్చుని చూశా. కచ్చితంగా ఈ సినిమా బ్లాస్ట్ అవుతుందని అన్నారు. రాజ్ నిడిమోరు మాట్లాడుతూ .. ‘మా ఇంటి బంగారం’ అనే పేరులోనే ఎంతో ఎఫెక్షన్, లవ్ ఉంటుంది. దాని వెనకాల డార్క్ సైడ్, పొసెసివ్ నెస్ కూడా ఉంటుంది. సమంత, నందినీ రెడ్డి మధ్య ఉండే క్లోజ్‌నెస్ అందరికీ తెలిసిందే. వారిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. అందుకే నందినీ రెడ్డిని దర్శకురాలిగా తీసుకున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

ముగిసిన సమావేశం.. ఎగ్జిబిటర్స్ సమస్యలు విని చిరంజీవి ఆశ్చర్యం!

హరిరామజోగయ్య కుమారుడిపై గేయ రచయిత అనంత శ్రీరామ్ ఫిర్యాదు

10 కోట్ల బడ్జెట్.. 1000 కోట్ల కలెక్షన్స్?.. ఇది కదా సక్సెస్ అంటే?

Updated Date - May 26 , 2026 | 12:54 AM