‘సలార్-2’ కంటే ముందే ‘డ్రాగన్-2’.. నీల్ ప్లాన్ ఇదేనా?
ABN, Publish Date - Nov 19 , 2026 | 09:30 PM
వరుసగా సీక్వెల్స్‌తోనే సాగుతున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అయితే ప్రశాంత్ నీల్ ‘సలార్’ సీక్వెల్ కంటే ముందుగానే ‘డ్రాగన్’ పార్ట్ 2 వస్తుందని టాక్ నడుస్తోంది.
‘కెజియఫ్’ సిరీస్ చిత్రాలతో గ్రాండ్ సక్సెస్ చూసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు.. సీక్వెల్స్ పై మోజు పెరుగుతూనే ఉంది. అందుకు నిదర్శనంగా ‘కెజియఫ్-2’ తర్వాత తెరకెక్కించిన ‘సలార్’కు మరో పార్ట్ ఉందని చెప్పేశారు. ఇప్పుడు యన్టీఆర్ (NTR)తో రూపొందిస్తోన్న ‘డ్రాగన్’కు కూడా రెండు భాగాలు ఉంటాయనీ అంటున్నారు ప్రశాంత్. 2023లో ‘సలార్’ సినిమా విడుదలైంది. ఇప్పటికి మూడేళ్ళు పూర్తయినా, ‘సలార్’ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే, ‘డ్రాగన్’ రెండు భాగాలను కొంత గ్యాప్‌తోనే రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారట ప్రశాంత్ నీల్. అలా ప్రభాస్ - ప్రశాంత్ నీల్ ‘సలార్-2’ కంటే ముందే.. ‘డ్రాగన్-2’ రానుందని టాక్.
వాస్తవానికి ప్రశాంత్ నీల్ ముందుగానే ‘సలార్’కు కూడా ‘కెజియఫ్’లా సీక్వెల్ ఉంటుందని భావించే సినిమా తెరకెక్కించారు. అలా ఇప్పటికే ‘సలార్-2’కు సంబంధించిన 50 శాతం షూటింగ్ పూర్తయింది. మిగిలిన సగం కూడా తెరకెక్కించి ఉంటే ‘సలార్-2’ ఎప్పుడో జనం ముందు నిలిచేది. అయితే ప్రభాస్ అంతకు ముందు కమిట్ అయిన సినిమాలు పూర్తి చేయడానికి వెళ్ళారు. ఆ లోగా తాను ‘డ్రాగన్’ పూర్తి చేయవచ్చునని ప్రశాంత్ నీల్ భావించారు. అయితే, స్టార్ హీరోస్ సినిమాల షూటింగ్స్ ప్రస్తుతం ఎంతగా ఆలస్యమవుతున్నాయో తెలియంది కాదు. ప్రభాస్ వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో ‘సలార్-2’లో మిగిలిన సగం పూర్తి చేయడానికి జాప్యం జరుగుతోంది. ఈ సమస్యను పసికట్టిన ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’కు ఆ పరిస్థితి రాకూడదని ముందుగానే రెండు భాగాలూ పూర్తి చేస్తున్నారట. ఈ రెండు భాగాలనూ వచ్చే యేడాది విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇక వచ్చే యేడాది వేసవిలో ‘సలార్-2’ సెట్స్‌కు వెళ్తుందని వినిపిస్తోంది. అప్పుడు ‘డ్రాగన్’ రెండు భాగాలు వచ్చాకే, ‘సలార్-2’ వస్తుంది కదా! అలా ‘సలార్-2’ కంటే ముందే ‘డ్రాగన్-2’ వస్తుందన్న మాట!
‘డ్రాగన్’ సినిమాను వచ్చే సంవత్సరం జూన్ 11న విడుదల చేయనున్నారు. ‘డ్రాగన్’ రెండో భాగాన్ని 2027లోనే డిసెంబర్లో రిలీజ్ చేసే ప్లాన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు ఉన్నారట. ఒకవేళ ‘డ్రాగన్-2’ పోస్ట్ ప్రొడక్షన్లో జాప్యం జరిగినా, 2028 వేసవిలో ఆ సినిమాను రిలీజ్ చేస్తారని వినిపిస్తోంది. ఇక ‘సలార్-2’ విషయానికి వస్తే ఈ మూవీ వచ్చే సంవత్సరం వేసవిలో సెట్స్‌కు వెళ్తుంది. ఆ యేడాది వరుసగా ప్రభాస్ మూవీస్ రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లోనూ 2027లో ‘సలార్-2’ వచ్చే ఛాన్స్ లేదు. ఈ సినిమా 2028లో ప్రేక్షకుల ముందుకు రావచ్చు. అయినా 2028 సమ్మర్ లోగా వచ్చే ఛాన్స్ లేదు.. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమైతే ఆ సమయంలో ‘డ్రాగన్-2’ రిలీజ్‌కు సిద్ధమవుతూ ఉంటుంది. కాబట్టి ‘సలార్-2’ కంటే ముందుగానే ‘డ్రాగన్-2’ ప్రేక్షకుల ముందు నిలిచే అవకాశం ఉంది.. ఫైనల్‌గా ఏమవుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
శర్వా ‘భోగి’ న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?
నా కుమార్తెపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోను.. యాక్షన్ కింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
బోయపాటికి బన్నీ గ్రీన్ సిగ్నల్.. ఈసారి ఊహించని ట్విస్ట్