Salaar 2: ఫైనల్ గా సలార్ 2 ని ప్రకటించిన మేకర్స్..
ABN , Publish Date - Jan 28 , 2026 | 02:36 PM
బాహుబలి తర్వాత సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ (Prabhas) అభిమానులకు, ఒకే ఒక్క సినిమాతో ఆకలి తీర్చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel). అదే సలార్: పార్ట్ 1 - సీజ్‌ఫైర్.
Salaar 2: బాహుబలి తర్వాత సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ (Prabhas) అభిమానులకు, ఒకే ఒక్క సినిమాతో ఆకలి తీర్చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel). అదే సలార్: పార్ట్ 1 - సీజ్‌ఫైర్. డైలాగులు తక్కువ.. యాక్షన్ ఎక్కువ అయినా కూడా కటౌట్ కేవలం నిలబడితే చాలు బాక్సాఫీస్ బద్దలైపోతుందని ప్రభాస్ ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ చేశాడు. సినిమా రిలీజై రెండేళ్లు దాటినా, ఇప్పటికీ ఆ ఖాన్సార్ మేనియా తగ్గలేదు. మరి అంతటి క్రేజ్ ఉన్న ఈ సినిమాకు సీక్వెల్ ఉందా? లేక ఆగిపోయిందా? గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చకు తాజాగా ఒక పోస్టర్‌తో ఫుల్ స్టాప్ పడింది.
సలార్ సినిమా చివర్లో శౌర్యాంగ పర్వం అంటూ పార్ట్-2 కోసం భారీ హింట్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. దీంతో పార్ట్-2 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. సీన్ కట్ చేస్తే ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు. అటు ప్రశాంత్ నీల్ కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా అనౌన్స్ చేయడంతో, సలార్-2 అటకెక్కినట్టేనని ప్రచారం మొదలైంది. సోషల్ మీడియాలో నెగటివ్ వార్తలు, సినిమా ఆగిపోయిందనే రూమర్లు ప్రభాస్ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. అందరూ ఆశలు వదిలేసుకుంటున్న సమయంలో.. హోంబలే ఫిల్మ్స్ ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. తాజాగా హీరోయిన్ శ్రుతి హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. కేవలం విష్ చేయడమే కాదు, అందులో ఆద్య క్యారెక్టర్‌ను మెన్షన్ చేస్తూ సలార్-2 త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుందని హింట్ ఇచ్చేశారు. దీంతో ఇన్నాళ్ళు వచ్చిన పుకార్లన్నీ పటాపంచలైపోయాయి. ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ కాంబో మళ్ళీ ఖాన్సార్ గడ్డపై అడుగుపెట్టబోతున్నారని అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయింది.
నిజానికి, రీసెంట్‌గా వచ్చిన రాజాసాబ్ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకోవడంతో ప్రభాస్ అభిమానులు డిజప్పాయింట్ అయ్యారు. ఒక పక్క డిజాస్టర్ టాక్, మరోపక్క సినిమాల ఆలస్యం ఫ్యాన్స్‌ను కొద్దిగా డిజప్పాయింట్ చేశాయి. ఇలాంటి సమయంలో సలార్-2 వార్త రావడం అంటే..ఎడారిలో నీళ్లు దొరికినట్టే..! దేవా - వరదాల మధ్య అసలైన యుద్ధం పార్ట్-2 లోనే ఉండబోతోంది. పార్ట్-1 కేవలం శాంపిల్ మాత్రమేనని, పార్ట్-2 లో యాక్షన్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందని ప్రశాంత్ నీల్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే సలార్-2 షూటింగ్ షెడ్యూల్స్ గురించి మరిన్ని వివరాలు రానున్నాయి. మరి ఖాన్సార్ సింహాసనం కోసం దేవా చేసే పోరాటం ఎలా ఉండబోతోంది? ప్రశాంత్ నీల్ ఈసారి ఎలాంటి విజువల్ వండర్ తో ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి.