Dragon: ట్రైనర్ లుక్.. ఈ పాత్రని గుర్తుపెట్టుకోండి!
ABN , Publish Date - May 23 , 2026 | 04:50 PM
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘డ్రాగన్’ సినిమా నుంచి వస్తున్న అప్‌డేట్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న విషయం తెలిసిందే. గ్లింప్స్ రిలీజ్ తర్వాత ఈ మూవీపై బీభత్సంగా చర్చలు నడుస్తున్నాయి.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘డ్రాగన్’ (Dragon) సినిమా నుంచి వస్తున్న అప్‌డేట్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఒక క్యారెక్టర్ పోస్టర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పీక్స్‌కు తీసుకెళ్లింది. తలపై సాంప్రదాయ స్కార్ఫ్, తెల్ల గడ్డం, ముఖంపై పచ్చబొట్లతో ఇంటెన్స్ లుక్‌తో ఉన్న ఒక వృద్ధుడి క్యారెక్టర్‌ను ఇటీవల వచ్చిన గ్లింప్స్‌లో పరిచయం చేసిన విషయం తెలిసిందే. గ్లింప్స్‌లో విజువల్స్ చూస్తుంటేనే ప్రశాంత్ నీల్ ఈసారి ఏ రేంజ్ డార్క్ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేశారో అర్థమవుతోంది.
ఈ పోస్టర్ ప్రకారం.. సినిమాలో ‘ది ట్రైనర్’ (The Trainer) క్యారెక్టర్‌లో బిమల్ ఒబెరాయ్ (Bimal Oberoi) కనిపించబోతున్నారని స్పష్టమవుతోంది. కథ ప్రకారం ఎన్టీఆర్ క్యారెక్టర్‌ను ఒక పవర్‌ఫుల్ వెపన్‌లా తీర్చిదిద్దే గురువు లేదా ట్రైనర్ పాత్ర ఇదని ఇండస్ట్రీ టాక్. ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరో క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసే ఇలాంటి సపోర్టింగ్ పాత్రలు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో తెలియంది కాదు. ఇప్పుడు ‘డ్రాగన్’లో కూడా ఈ ‘ట్రైనర్’ పాత్ర సినిమాకు మెయిన్ పిల్లర్‌లా నిలవబోతోందని, హీరో యాక్షన్ ఎపిసోడ్స్ వెనుక ఈ క్యారెక్టర్ గైడెన్స్ చాలా ఇంటెన్స్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఈ పాత్రని బాగా గుర్తు పెట్టుకోండి.. సినిమా విడుదల తర్వాత అంతా మాట్లాడుకునేలా ట్రైనర్ పాత్రని నీల్ డిజైన్ చేశారనేలా టాక్ నడుస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌ను టి-సిరీస్ (T-Series) సంస్థ నార్త్‌లో భారీ స్థాయిలో ప్రెజంట్ చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లుగా టాక్ నడుస్తోంది. హాలీవుడ్ రేంజ్ విజువల్స్, నార్త్-సౌత్ నటీనటుల క్రేజీ కాంబినేషన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి:
40 ఏళ్ల తర్వాత సీక్వెల్‌కు ప్లాన్.. ఈ మూవీ వివరాలు తెలిస్తే షాకే!
ఏయన్నార్ నటవారసునిగా మెప్పించిన నాగార్జున
MEGA158: ‘దట్స్ ఇట్.. ద బ్లడీ బెంచ్ మార్క్’.. టైటిల్ లీక్ చేసేస్తా!
అసలు చరణ్ - ఎన్టీఆర్ మధ్య ఏం జరుగుతోంది?