Salaar 2- Bobby Simha: దర్శకుడి ప్లాన్ మామూలుగా లేదు.. ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం!

ABN , Publish Date - Mar 16 , 2024 | 05:43 PM

పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌(Prabhas) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ (Prasanth neel) తెరకెక్కించిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘సలార్‌’ (Salaar). గత ఏడాది డిసెంబర్‌లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద చక్కని విజయాన్ని అందుకొంది.

Salaar 2- Bobby Simha: దర్శకుడి ప్లాన్ మామూలుగా లేదు.. ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం!

పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌(Prabhas) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ (Prasanth neel) తెరకెక్కించిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘సలార్‌’ (Salaar). గత ఏడాది డిసెంబర్‌లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద చక్కని విజయాన్ని అందుకొంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘సలార్‌ 2: శౌర్యాంగ పర్వం’ తెరకెక్కుతోంది. ఈ సినిమా అప్‌డేట్‌ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించిన బాబీ సింహా తాజాగా ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.



‘‘సలార్‌ క్లైమాక్స్‌లో చివరి 10 నిమిషాలు ప్రేక్షకులకు గూజ్‌ బంప్స్‌ వచ్చాయి.  పార్ట్‌ 2లో ఆ ఫీల్‌ 100 రెట్లు అధికంగా ఉంటుంది. జనాలు ఆశ్చర్యపోయేలా క్లైమాక్స్‌ను సిద్ధం చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్‌. నేను కూడా షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభిస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని బాబీ సింహా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం  ఈ  వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  

ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో నటిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీపికా పదుకొణె కథానాయిక. కమల్‌హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేసవి కానుకగా మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందీ సినిమా. అలాగే మారుతీ దర్శకత్వంలో ‘రాజా సాబ్‌’ లోనూ ప్రభాస్‌ నటిస్తున్నారు.  రొమాంటిక్‌ హారర్‌ కామెడీగా ఇది తెరకెక్కుతోంది.

Updated Date - Mar 16 , 2024 | 05:43 PM