Dragon Glimpse: పొరపాటున కూడా నా కల్లోకి రావొద్దు.. అదిరిపోయిన గ్లింప్స్ 

ABN, Publish Date - May 19 , 2026 | 11:41 PM

మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ‘డ్రాగన్‌’ సినిమా గ్లింప్స్‌ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.

మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ‘డ్రాగన్‌’ సినిమా గ్లింప్స్‌ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఆ తరుణం రానే వచ్చింది. బుధవారం తారక్‌ పుట్టిన సందర్భంగా మంగళవారం రాత్రి 11.30 దాటిన తర్వాత 4.28 నిమిషాల నిడివి గల గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో తారక్‌ స్లిమ్‌ లుక్‌ అదిరిపోయింది. సింపుల్ గా కథను,  ప్రపంచాన్ని,  పాత్రలను ఈ గ్లింప్స్ ద్వారా పరిచయం చేశారు.తారక్‌ చెప్పిన డైలాగ్స్‌ అభిమానులను అలరించేలా ఉన్నాయి. విజువల్స్‌, రవి బస్రూర్‌ నేపథ్య సంగీతం ఫ్యాన్స్‌ అంచనాలను రెట్టింపు చేయడం ఖాయం. పవర్‌ఫుల్‌గా సాగిన ఈ గ్లింప్స్‌ను మీరూ చూసేయండి.

Updated at - May 19 , 2026 | 11:58 PM