RC17: పోస్టర్ చూసి.. ఆ సినిమాతో పోల్చుతున్నారేంటి? రీమేక్ కాదు కదా..

ABN , Publish Date - Nov 02 , 2026 | 04:06 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రాబోతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘ఆర్సీ17’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో వార్త వైరల్ అవుతోంది.

RC17 Movie Remake Rumours

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), జీనియస్ డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) కలయికలో ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రాబోతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం #RC17 (#RC2Sukku). నవంబర్ 1 ఆదివారం మెగాస్టార్ చిరంజీవి తొలి క్లాప్‌తో ఈ క్రేజీ ప్రాజెక్ట్ హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన సరికొత్త కాన్సెప్ట్ పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారడంతో పాటు.. నెట్టింట ఒక అనూహ్యమైన సరికొత్త చర్చకు తెరలేపింది.


ఈ పోస్టర్‌లో నీలం, ఆకుపచ్చ రంగుల బ్రష్‌స్ట్రోక్స్‌తో కూడిన నెమలి పింఛం బ్యాక్‌డ్రాప్‌లో రామ్ చరణ్ ఫేస్ కట్స్ కనిపించడంతో.. ఇది గుజరాతీలో చారిత్రక రికార్డులు సృష్టించిన ‘లాలో - కృష్ణ సదా సహాయతే’ (Laalo - Krishna Sada Sahaayate) చిత్రానికి రీమేక్ అంటూ కొందరు నెటిజన్లు ప్రచారం మొదలుపెట్టారు. కేవలం రూ. 50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కి ఏకంగా రూ. 122 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టిన ‘లాలో’ చిత్రంలో శ్రీకృష్ణుడి తత్వం, ఆయన పాత్రే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గతంలో ఈ సినిమా తెలుగు రీమేక్‌లో రామ్ చరణ్ శ్రీకృష్ణుడిగా నటిస్తే బాగుంటుందనే ఊహాగానాలు రావడం, ఇప్పుడు #RC17 పోస్టర్‌లోనూ నెమలి ఈక (కృష్ణుడి ప్రతీక) కనిపించడంతో.. సుకుమార్ కూడా రామ్ చరణ్‌తో ‘లాలో’ రీమేక్ చేస్తున్నారా? అనే సందేహాలు సినీ అభిమానుల్లో వ్యక్తమయ్యాయి.


అయితే, ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని, ఇది పక్కా సుకుమార్ సొంత కథ అని చిత్ర వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ విడుదల సమయానికే దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) సైతం ఈ కాంబో గురించి మాట్లాడుతూ.. రామ్ చరణ్ కోసం సుకుమార్ రాసుకున్న ఇంట్రడక్షన్ సీన్ తనకు గూస్‌బంప్స్ తెప్పించిందని, సినిమా సెన్సేషనల్ హిట్ అంటూ స్వయంగా వెల్లడించారు. ‘పుష్ప’ ఫ్రాంచైజీతో గ్లోబల్ లెవెల్ గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్, రామ్ చరణ్ వంటి పాన్-ఇండియా స్టార్‌తో పనిచేస్తున్నప్పుడు పరభాషా చిత్రాలను రీమేక్ చేసే ప్రశ్నే ఉండదని సినీ విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు. పోస్టర్‌లోని నెమలి పింఛం కేవలం కథలోని నిగూఢమైన కోణాన్ని, ప్రకృతితో ముడిపడిన ఏదైనా సరికొత్త ప్రపంచాన్ని సూచించే ప్రతీక మాత్రమే అయ్యుంటుందని తెలుస్తోంది. మరి ఈ రీమేక్ రూమర్లపై చిత్ర యూనిట్ నుంచి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఏమైనా ఉందేమో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

‘రణబాలి’ ఓటీటీ రిలీజ్ డేట్.. లీక్ చేసిన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్

శింబు - నయన్.. పదేశ్ల తర్వాత మళ్లీ కలవబోతోన్న క్రేజీ జోడీ?

సూర్య వెయ్యి కోట్లు కొల్లగొడతాడా.. అసలు సీన్‌కి అంత సీన్ ఉందా?

Updated Date - Nov 02 , 2026 | 04:06 PM

RC17 హీరోయిన్ SA కాదు, AP కాదు, PM కాదు.. అచ్చ తెలుగమ్మాయ్

RC17: పూజా కార్యక్రమాలతో మొదలైన రాంచరణ్-సుకుమార్ సినిమా

RC17: యు కెన్ ఇమాజిన్.. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌‌కు అర్థమేంటి?

RC17 కోసం రామ్ చరణ్ షాకింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్

RC17కు ‘దేవి శ్రీ ప్రసాద్’ ఉంటారా? క్లారిటీ ఇచ్చిన మైత్రీ రవిశంకర్